కుక్క కరిచిందంటే ఎంతో ఆందోళనగా ఉంటుంది. పిల్లలకు ఈ ప్రమాదం మరీ ఎక్కువగా పొంచి ఉంటుంది. కుక్క కాటుకు గురైనప్పుడు ఆందోళన చెందకూడదు. ఇన్ఫెక్షన్ను నివారించుకోవడానికి వీలైనంత త్వరగా వైద్య సహాయం పొందాలి. ఆలస్యం చేస్తే దీర్ఘకాలిక ప్రభావాలకు గురికావాల్సి వస్తుంది.
రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నవాళ్లు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు కుక్క కరిచిన తర్వాత మరిన్ని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. ఇక కుక్క కాటు చర్మంపై లోతుగా ఉంటే నరాలు, కండరాలు, రక్త నాళాలు ధ్వంసమవుతాయి. మరీ పెద్ద కుక్కలైతే ఎముకల మీద కూడా ప్రభావం పడుతుంది. ఎలా ఉన్నా మరిన్ని సమస్యలు తలెత్తకుండా వైద్య సహాయం పొందడం మాత్రం తప్పనిసరి.