Barley Water | కేవలం వేసవి సీజన్లో మాత్రమే కాదు, బార్లీ జావను ఏ సీజన్లో అయినా సరే తాగవచ్చు. బార్లీ జావను తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. బార్లీ గింజల్లో అనేక పోషకాలు ఉంటాయి. అందువల్ల వీటితో తయారు చేసే జావను రోజూ తాగుతుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి. బార్లీ గింజలతో జావ అయితే తాగుతారు కానీ దీన్ని ఎలా తయారు చేయాలో చాలా మందికి తెలియదు. ఈ క్రమంలోనే ఈ గింజలతో జావను ఎలా తయారు చేయాలో, దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. బార్లీ గింజల జావ తయారీకి పావు కప్పు బార్లీ గింజలను తీసుకోవాలి. మజ్జిగను ఒక కప్పు, దానిమ్మ గింజలు – గుప్పెడు, ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని తీసుకోవాలి.
బార్లీ గింజలను కడిగి నీళ్లు పోసి 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల గింజలు త్వరగా ఉడుకుతాయి. ఈ గింజలను కుక్కర్లో వేసి 7 నుంచి 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. పూర్తిగా చల్లారిన తరువాత వడబోసి పటికబెల్లం, నిమ్మరసం కలిపి తాగవచ్చు. పలుచని మజ్జిగ కలిపి దానిమ్మ గింజలను వేసి కూడా తీసుకోవచ్చు. మజ్జిగకు బదులుగా పుచ్చకాయ రసం, పైనాపిల్ రసం కలిపి తాగినా చాలా రుచిగా ఉంటుంది.
ఇలా తయారు చేసిన బార్లీ జావను రోజూ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. బార్లీ జావలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గిపోతాయి. జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారుతుంది. పేగుల్లోని చెత్త బయటకు పోతుంది. అలాగే ఈ గింజల్లో ఉండే ఫైబర్ వల్ల బరువు తగ్గడం సులభతరం అవుతుంది. ఈ జావ మెటబాలిజంను పెంచుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఈ జావను తాగడం వల్ల శరీరం అంతర్గతంగా క్లీన్ అవుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. లివర్, కిడ్నీలు కూడా క్లీన్ అవుతాయి. ముఖ్యంగా కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. మూత్ర పిండాల ఆరోగ్యం మెరుగు పడుతుంది.
బార్లీ గింజలకు చలువ చేసే గుణం ఉంటుంది కనుక ఈ గింజలతో తయారు చేసిన జావను తాగితే శరీరం చల్లగా మారుతుంది. శరీరంలోని వేడి తగ్గిపోతుంది. వేడి శరీరం ఉన్నవారు రోజూ ఈ జావను తాగుతుంటే ఎంతో మేలు జరుగుతుంది. వేసవిలోనే కాదు కొందరికి ఎల్లప్పుడూ శరీరం వేడిగానే ఉంటుంది. దీంతో నోట్లో, నాలుకపై పుండ్లు ఏర్పడుతుంటాయి. ఇలాంటి వారు రోజూ బార్లీ జావను తాగితే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను కరిగించడంలోనూ బార్లీ జావ అద్భుతంగా పనిచేస్తుంది. బార్లీ జావను రోజూ తాగడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. ముఖ్యంగా ఎల్డీఎల్ తగ్గి హెచ్‌డీఎల్ పెరుగుతుంది. దీంతో రక్త నాళాల్లో ఉండే కొవ్వు కరుగుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రావు, హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు.
జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బార్లీ జావ ఎంతగానో దోహదపడుతుంది. జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బాక్టీరియాను ఈ జావ పెంచుతుంది. షుగర్ ఉన్నవారు ఈ జావను తాగితే ఎంతో మేలు జరుగుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. ఇలా బార్లీ జావను తాగడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.