ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది నడివయసుకు చేరుకునే సరికే అధిక రక్తపోటు (బీపీ) బారినపడుతున్నారు. అయితే, ఫ్రాంటియర్స్ న్యూట్రిషన్ అనే జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం అరటి, యాపిల్ పండ్లు తినేవారిలో ఏ కారణంతోనైనా మరణించే ముప్పు దాదాపు 40 శాతం తక్కువని తేలింది.
వారంలో మూడు నుంచి ఆరుసార్లు అరటి, యాపిల్ తింటే మంచిదని ఈ అధ్యయనంలో వెల్లడైంది. అరటిపండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి బీపీ నియంత్రణకు దోహదపడుతుండ వచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. కానీ పియర్స్, ద్రాక్ష, పైనాపిల్ పండ్ల నుంచి మాత్రం ఇలాంటి ప్రయోజనాలు ఆశించలేమని పరిశోధకులు తెలిపారు.