కార్తిక మాసంలోనే దొరికే అద్భుతం.. ఉసిరి. ఇది పోషకాల గని. ఇందులోని పోషకాలు, మినరల్స్, విటమిన్స్..
ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అనేక రోగాల నుంచి బయట పడేస్తాయి. ఉసిరితో కలిగే ప్రయోజనాలు.
చలికాలంలో వచ్చే ఆరోగ్య సమస్యల్లో.. జలుబు, దగ్గు ముందుంటాయి. ఉసిరికాయలు.. వీటికి సమర్థంగా చెక్ పెడుతాయి. ఇందులో విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలం. ఇవి శ్వాసనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. విటమిన్ సి.. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. జలుబు, దగ్గును దూరం చేస్తుంది.
చలి వాతావరణంలో చర్మం పొడిబారుతుంది. అయితే, ఉసిరిలో ఉండే విటమిన్ సి, ఎ.. చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ఫలితంగా చర్మం పొడిబారడం తగ్గుతుంది. మృదువుగా తయారవుతుంది. వృద్ధాప్య ఛాయలనూ తగ్గిస్తుంది.
జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉసిరిని మించిన ఔషధం లేదు. ఇందులోని విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు జుట్టుకు కావాల్సిన పోషణనిస్తాయి. వెంట్రుకలు రాలిపోకుండా కాపాడుతాయి. జుట్టును బలంగా, మెరిసేలా చేయడంలో ఉసిరి ముందుంటుంది.
శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను తొలగించడంలో ఉసిరి సాయపడుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. జీవక్రియల వేగం పెంచుతుంది.
ఉసిరిలో ఫైబర్ ఎక్కువ, కేలరీలు తక్కువగా ఉంటాయి. దాంతో బరువు తగ్గాలని అనుకునేవారికి మంచి ఫలితాలు అందిస్తుంది. ఉదయాన్నే ఉసిరిని తీసుకుంటే.. కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్
కలుగుతుంది. త్వరగా ఆకలి వేయకుండా చేస్తుంది.
ఉసిరిలో ఉండే ఫైబర్.. జీర్ణక్రియ సమర్థంగా సాగడానికి సహాయపడుతుంది. మలబద్దకాన్ని తరిమికొడుతుంది. పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది.
కళ్ల ఆరోగ్యానికీ ఉసిరి భరోసా ఇస్తుంది. ఇందులో పుష్కలంగా లభించే విటమిన్ ఎ.. కంటి చూపును మెరుగుపరుస్తుంది. కంటిలో శుక్లాలు లాంటి ప్రమాదాలను తగ్గిస్తుంది.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరి కాయను నమిలి తినడం వల్ల.. మధుమేహం అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే క్రోమియం.. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది.