HomeHealthAmla Aloe Vera Mines Of Minerals And Vitamins It Cures Many Diseases
ఉసిరి+కలబంద.. ఆరోగ్య పానీయం
ఉసిరిలో విటమిన్-సి పుష్కలం. ఇది యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది. ఇందులో అమైనో ఆమ్లాలు, ఐరన్, విటమిన్-ఎ, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం సమృద్ధిగా ఉంటాయి.
ఉసిరి, కలబంద (అలోవెరా).. మినరల్స్, విటమిన్ల గనులు. అనేక వ్యాధులను పోగొడతాయి. వీటిని పొడిగా, పచ్చళ్లుగా, స్మూతీలుగా తీసుకోవచ్చు. ఆ మిశ్రమంతో చేసుకునే పానీయం బరువును తగ్గిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఉసిరిలో విటమిన్-సి పుష్కలం. ఇది యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది. ఇందులో అమైనో ఆమ్లాలు, ఐరన్, విటమిన్-ఎ, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం సమృద్ధిగా ఉంటాయి.
కలబందలో 32 రకాల విటమిన్లు, మినరల్స్, వందలకొద్దీ ఎంజైములు, పోషక పదార్థాలు ఉంటాయి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ గుణాలు అపారం.
ఉసిరి, కలబంద జ్యూస్ తరచూ తీసుకుంటే జీవక్రియలు వేగవంతమవుతాయి. దాంతో శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాల నుంచి విముక్తి లభిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం.. మనిషి బరువు పెరుగుదలకు ప్రధాన కారణం శరీరంలోని టాక్సిన్లు, వ్యర్థాల కుప్పలే.
ఉసిరి, కలబంద శరీరాన్ని తేమగా ఉంచుతాయి. దీంతో ఖాళీ కడుపుతో వచ్చే ఇబ్బందులు దూరం అవుతాయి. చక్కెర స్థాయులను సమతూకంలో ఉంచుతాయి.
ఉసిరి, కలబంద పానీయం ఎన్నో పోష కాలను కలిగి ఉంటుంది. వ్యాయామం వల్ల వచ్చే అలసట నుంచి ఉపశమనం ఇస్తుంది.
ఇదో సులభమైన పద్ధతి. అరకప్పు ఉసిరి, అరకప్పు కలబంద పానీయాలను బాగా కలుపుకొని తాగితే చాలు. ఆరోగ్యకరమైన పోషకాలు మన సొంతం అవుతాయి. కాకపోతే, వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే ఏ నిర్ణయమైనా.