Fish benefits | వాతావరణం చల్లగా ఉంది.. ఇలాంటి వాతావరణంలో వేడి వేడిగా.. కమ్మగా.. చేపల పులుసు తింటే.. ఆ మజానే వేరుగా ఉంటుంది. చేపలను ఎలా తిన్నా సూపర్‌గా ఉంటుంది. పులుసే కాదు, చేపల వేపుడు కూడా అద్భుతంగానే ఉంటుంది. చేపలను ఏదో ఒక రూపంలో వారంలో కనీసం 2, 3 సార్లు తింటే అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో తెల్సుకుందాం.
చేపల్లో అన్ని రకాల పోషకాలు.. ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, మినరల్స్ లభిస్తాయి. విటమిన్ ఏ. విటమిన్ డీతోపాటు పాటు ఫాస్పరస్ వంటి పోషకాలు వీటి నుంచి మనకు అందుతాయి. అమైనో యాసిడ్స్ ఉండే మాంసాహారం ఒక్క చేపలే. ప్రతిరోజూ చేపలు తినేవారిలో గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలు తక్కువగా ఉంటాయని వైద్యులు చెప్తుంటారు. చిన్న చిన్న చేపల్ని ముల్లు సహా తిన్నప్పుడు కాల్షియం, భాస్వరం, ఐరన్ మన శరీరానికి అందుతాయి. వీటిలో మాత్రమే దొరికే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండెకు మేలు చేస్తాయి.