Blueberry Benefits | మీ మెమొరీ పాదరసంలా పెరగాలా? అయితే ఈ పండ్లను రెగ్యులర్‌గా తినండి!
Blueberry Benefits | బ్లూబెర్రీలు పోషకాల గనులు. పొద్దున్నే టిఫిన్‌గా ఏదో ఓ రూపంలో తీసుకుంటే.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మెదడుకు అండగా నిలిచే పండిది. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు, ఇతర మూలకాలు శరీరంలో కణాల విధ్వంసానికి, వృద్ధాప్యానికి కారణమయ్యే ఆక్సిడేటివ్ స్ట్రెస్ మీద పోరాడతాయి. బ్లూబెర్రీల్లో ఫ్లేవనాయిడ్లు, యాంథోసైనిన్లు అనే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.'
Blueberry Benefits | బ్లూబెర్రీలు పోషకాల గనులు. పొద్దున్నే టిఫిన్‌గా ఏదో ఓ రూపంలో తీసుకుంటే.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మెదడుకు అండగా నిలిచే పండిది. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు, ఇతర మూలకాలు శరీరంలో కణాల విధ్వంసానికి, వృద్ధాప్యానికి కారణమయ్యే ఆక్సిడేటివ్ స్ట్రెస్ మీద పోరాడతాయి. బ్లూబెర్రీల్లో ఫ్లేవనాయిడ్లు, యాంథోసైనిన్లు అనే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.’
మెరుగైన జ్ఞాపకశక్తి
బ్లూబెర్రీ పండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఓ పరిశోధన పేర్కొన్నది. పరిశోధకులు కొంతమందికి రోజూ బ్లూబెర్రీ రసం ఇస్తూ వారి ఆరోగ్య పరిస్థితులను అధ్యయనం చేశారు. పన్నెండు వారాల తర్వాత వారి జ్ఞాపకశక్తిలో మెరుగుదల కనిపించింది. బ్లూబెర్రీలు తింటే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జాగరూకత (అలర్ట్‌నెస్) చేకూరుతుంది.
నాడీ సంబంధ వ్యాధుల నుంచి రక్షణ
నాడుల క్షీణతకు సంబంధించిన అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధుల ముప్పును కూడా బ్లూబెర్రీలు తగ్గిస్తాయట. అయితే, దీని గురించి మరింత అధ్యయనం జరగాల్సి ఉంది. మెదడులో విషపూరిత ప్రొటీన్లు పేరుకుపోకుండా బ్లూబెర్రీల్లోని యాంటీ ఆక్సిడెంట్లు సమర్థంగా అడ్డుకుంటాయని వెల్లడైంది.
వృద్ధాప్యానికి చెక్
మనుషుల్లో వయసు పైబడటం, మేధా సామర్థ్యం తగ్గుదల.. ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. బ్లూబెర్రీ ఈ సమస్య నుంచి రక్షణ కల్పిస్తుంది. ‘ఎనల్స్ ఆఫ్ న్యూరాలజీ’లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు తీసుకునే వారి మేధా సామర్థ్యం తగ్గుదల రెండున్నరేళ్లు వాయిదా పడుతుందట.
ఆహారంలో భాగంగా…
1. ఇవి ఏడాదంతా దొరుకుతాయి. తాజాగా తిన్నా, ఫ్రిజ్‌లో ఉంచి తిన్నా కూడా ఒకే రకం ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. ఉదయం వేళల్లో అయితే వీటికి ఓట్స్, యోగర్ట్ చేర్చుకోవచ్చు. లేదంటే స్మూతీగా తీసుకోవచ్చు.
2. యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధమైన బ్లూబెర్రీ టీ కూడా ఆరోగ్యానికి మంచిదే.
3. బ్లూబెర్రీలను ఒక బౌల్లో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టుకుని ఆరోగ్యకరమైన స్నాక్‌గా ఎప్పుడంటే అప్పుడు తినేయొచ్చు.
4. మఫిన్స్, పాన్‌కేక్స్, డెజర్ట్ రూపంలో కూడా బ్లూబెర్రీలను తినొచ్చు.
5. ఊదారంగు బ్లూబెర్రీలను వేసుకుని సలాడ్లను మరింత వర్ణరంజితం చేసుకోవచ్చు.
Read More :
“Raw Coconut | తరచూ పచ్చికొబ్బరి తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందా..?”
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!





