Apps:
Follow us on:

Paneer | బరువు తగ్గాలని అనుకునేవాళ్లు పన్నీర్‌ తినొచ్చా?

1/6Paneer Health Benefits | పన్నీర్ తినడం వల్ల ఆకలి త్వరగా వేయదు. ఆహారం మితంగానే తీసుకుంటారు. దీంతో బరువు తగ్గుతారు. ఇందులో పోషకాలు ఎక్కువ. రోజూ ఆహారంలో పన్నీర్‌ను భాగం చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు.
2/6ప్రతిరోజూ 50 గ్రాముల పన్నీరును తింటే భవిష్యత్‌లో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది.
3/6పన్నీర్‌ తినడం వల్ల దంతక్షయం సమస్య నుంచి కూడా బయటపడవచ్చు.
4/6పన్నీర్‌ తినడం వల్ల మధుమేహం బారిన పడకుండా ఉండవచ్చు. దీన్ని తినడం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. బ్లడ్ షుగర్ ప్రమాణాలను పన్నీరు క్రమబద్ధీకరిస్తుంది.
5/6పన్నీర్‌లో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. ఫోలేట్ బి కాంప్లెక్స్ విటమిన్. ఇది గర్భిణులకు ఎంతో ముఖ్యం. గర్భంలోని పిండాభివృద్ధికి ఇది సహకరిస్తుంది. ఇందులో విటమిన్ డి, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇవి రొమ్ము క్యాన్సర్‌ను నిరోధిస్తాయి.
6/6ఇది అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. గుండెపోటు రాకుండా అడ్డుకుంటుంది. పన్నీర్‌లోని ఫొలేట్ ఎర్ర రక్తకణాలను అధికంగా ఉత్పత్తి చేస్తుంది.