HomeHealthThe Amazing Health Benefits Of The Ivy Gourd Aka Tindora
Ivy Gourd | షుగర్ ఉన్నవాళ్లు దొండకాయ తినొచ్చా?
రోజువారీగా వండుకునే కూరగాయల్లో దొండకాయ ఒకటి. చూడటానికి చిన్నగా, పొట్టిగా కనపడినా తక్కువ అంచనా వేయలేం. దొండలోనూ అనేక పోషకాలున్నాయి. దొండ కాయల్ని తింటే బుద్ధి మందగిస్తుందనేది అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు.
దొండలోని యాంటీ -హిస్టమైన్ గుణాల వల్ల అలర్జీ రాదు. దగ్గు, ఆకలి లేకపోవడం వంటి సమస్యలతో బాధపడేవారికి పరమౌషధం. వీటిలోని విటమిన్-బి నాడీ వ్యవస్థను రక్షిస్తుంది. మానసిక ఆందోళన, మూర్ఛ వ్యాధితో బాధపడేవారికి దొండ చక్కటి పరిష్కారం.
4/6
దొండకాయలోని క్యాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. ఎముకలకు గట్టిదనాన్ని ఇస్తుంది. మధుమేహవ్యాధిగ్రస్తులు కూడా నిక్షేపంగా తినవచ్చు.
5/6
థయమిన్ దొండలో పుష్కలంగా ఉంటుంది. ఇది కొవ్వు, ప్రొటీన్ల జీవక్రియకు ఉపయోగపడుతుంది. బి-కాంప్లెక్స్ విటమిన్లు జీర్ణవ్యవస్థకూ మేలుచేస్తాయి.
6/6
ఇందులోని విటమిన్-సి, బీటా కెరోటిన్లు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి.
7/6
రిబోఫ్లేవిన్ పుష్కలంగా ఉండే దొండకాయ మనసును ప్రశాంతంగా ఉంచి, డిప్రెషన్‌ను తగ్గిస్తుంది.