Health Tips | వంటకాల్లో ఉపయోగించే చెదర్ చీజ్ ఆరోగ్యానికి మంచిదేనా?
ఇటీవల మనం వివిధ వంటకాల్లో చెదర్ చీజ్ వాడుతున్నాం. ఇది ఆరోగ్యానికి మంచిదేనా? మంచిదైతే ఎంత మోతాదులో తీసుకోవాలి?
ఇటీవల మనం వివిధ వంటకాల్లో చెదర్ చీజ్ వాడుతున్నాం. ఇది ఆరోగ్యానికి మంచిదేనా? మంచిదైతే ఎంత మోతాదులో తీసుకోవాలి?
-ఓ పాఠకురాలు
చెదర్ అనేది ఇంగ్లండ్‌లో ఒక ఊరి పేరు. తొలుత ఈ రకం చీజ్ అక్కడ మాత్రమే తయారయ్యేది. అలా చెదర్ చీజ్ అయ్యింది. దీనిని ఆవు పాలతో ప్రత్యేకమైన పద్ధతుల్లో తయారు చేస్తారు. కాబట్టి, ఆరోగ్యానికి మంచిది. ఇందులో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. క్యాల్షియం, ఫాస్పరస్, జింక్, విటమిన్-బి 12 కూడా లభిస్తాయి. ఎముకల ఆరోగ్యానికి క్యాల్షియం సహకరిస్తుంది. ప్రొటీన్ కండరాలు పటిష్టంగా ఉండటానికి ఉపకరిస్తుంది.
విటమిన్ బి-12 మెదడును చురుగ్గా ఉంచుతుంది. జీవక్రియను మెరుగుపరిచేందుకు సాయ పడుతుంది. రోగ నిరోధక వ్యవస్థను జింక్ బలోపేతం చేస్తుంది. తయారీలో భాగంగా పాలను పులియబెడతారు కనుక, ప్రొ బయాటిక్‌గా జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే ఇందులో కొంతమేర శాచురేటెడ్ ఫ్యాట్స్, సోడియం ఉంటాయి. కాబట్టి, పరిమితంగా తీసుకుంటేనే మంచిది.
పరిపూర్ణ ఆరోగ్య వంతులు రోజుకు ఒక టేబుల్ స్పూన్ చొప్పున వారానికి ఒకటి రెండు సార్లు తినొచ్చు. బీపీ, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవాళ్లు ఆహారంలోని కేలరీలను చూసుకొని తినాలి. సలాడ్లు, ఉడకబెట్టిన కూర గాయలతో పాటు, శాండ్విచ్, దోశ.. ఇలా మన అభిరుచిని బట్టి ఈ చీజ్‌ను జోడించుకోవచ్చు. సోడియం ఉండటం వల్ల ఎక్కువకాలం నిల్వ ఉంటుంది. శాకాహారులకు మంచి ప్రొటీన్ సోర్స్ .
మయూరి ఆవుల , న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@gmail.com
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

