అల్జీమర్స్ బాధితులు ఆందోళనకరంగా పెరిగిపోతున్నారు. ప్రస్తుతం 5.5 కోట్ల మంది చిత్తవైకల్యంతో బాధపడుతున్నారు. ఏటా కొత్తగా కోటి మంది వరకూ జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా.. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగాలన్నా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.