ఉప్పునీటితో గొంతునొప్పికి చెక్!
వర్షాకాలం మొదలైంది. ఈ కాలం చిరుజల్లులు, ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటుగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం వంటి అనారోగ్యాలనూ వెంట తీసుకొస్తుంది. వర్షాకాలంలో నీటి మార్పు కారణంగా ఇట్టే పడిశెం పట్టేస్తుంది. జలుబు చేస్తే కనిపించే మొదటి లక్షణం గొంతునొప్పి. అది తగ్గడానికి చాలామంది రకరకాల మందులు వాడుతుంటారు.
వర్షాకాలం మొదలైంది. ఈ కాలం చిరుజల్లులు, ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటుగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం వంటి అనారోగ్యాలనూ వెంట తీసుకొస్తుంది. వర్షాకాలంలో నీటి మార్పు కారణంగా ఇట్టే పడిశెం పట్టేస్తుంది. జలుబు చేస్తే కనిపించే మొదటి లక్షణం గొంతునొప్పి. అది తగ్గడానికి చాలామంది రకరకాల మందులు వాడుతుంటారు. మీరు ఆ స్థాయిలో కష్టపడకుండానే ఇంట్లోనే సులభమైన చిటాతో మీ గొంతునొప్పిని తగ్గించుకోవచ్చు. అదే ఉప్పు నీటితో పుకిలించడం. ఇది గొంతు నొప్పి నుంచి త్వరగా ఉపశమనం ఇస్తుందని రీసెర్చ్ గేట్ అధ్యయనం పేరొంది.
ఉప్పు నీరు హైపర్టోనిక్గా ఉంటుంది. గొంతు కణాలలోని ద్రవం కంటే ఉప్పు నీటి సాంద్రత ఎకువగా ఉంటుంది. మీరు గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి పుకిలించినప్పుడు, ఇది వాచిన కణజాలాల నుంచి నీటిని బయటికి లాగి అసౌకర్యాన్ని తగ్గించి.. వాపును నివారిస్తుంది. గోరువెచ్చని ఉప్పునీరు గొంతు వెనుక భాగంలో ఉండే శ్లేష్మాన్ని వదులు చేయడానికి కూడా సాయపడుతుంది. దీనివల్ల శ్లేష్మాన్ని తొలగించడం సులభం అవుతుంది. కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఉప్పు వాతావరణంలో వృద్ధి చెందడానికి ఇబ్బంది పడతాయి. దాంతో గొంతు నొప్పి, చికాకు ఎఫెక్టివ్‌గా తగ్గుతుంది. 2014లో జరిగిన ఓ అధ్యయనం తేలికపాటి గొంతు నొప్పి, ఇన్ఫ్లమేషన్, చికాకు ఉన్న వ్యక్తులు గోరువెచ్చని ఉప్పు నీరు పుకిలిస్తే ఎఫెక్టివ్‌గా పని చేస్తుందని పేరొంది.
ఇది గొంతు నొప్పిని గణనీయంగా తగ్గించి, ఆహారం సౌకర్యవంతంగా మింగేలా చేస్తుంది. చికాకు, వాపు, గొంతు పొడిబారడాన్నీ నివారిస్తుంది. ఇందుకోసం.. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పావు నుంచి అర టీస్పూన్ ఉప్పు వేసి కలపండి. ఉప్పు పూర్తిగా కరిగే వరకు స్పూన్‌తో మిక్స్ చేయండి. ఒక గుక నీరు తాగి, మీ తలను కొద్దిగా వెనకి వంచి 15 నుంచి 30 సెకన్ల పాటు పుకిలించండి. దాన్ని ఉమ్మివేసి, రెండు నుంచి మూడుసార్లు రిపీట్ చేయండి.
నీరు గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి. గొంతు చికాకు ఎకువగా ఉంటే గంటకు ఒకసారి ఇలా చేయాలి. గోరువెచ్చని ఉప్పు నీరు పుకిలించడం సురక్షితమే అయినప్పటికీ, ఆ ద్రావణాన్ని మింగితే కడుపులో చికాకు కలగవచ్చు. ఈ లిక్విడ్ శరీరంలో నీటి శాతాన్ని ప్రభావితం చేయవచ్చు. గుండె, మూత్రపిండాల సమస్య ఉన్నవారు ఈ చిట్కా పాటించే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- colds
- coughs
- Monsoon season
- weather
RELATED ARTICLES
తాజా వార్తలు
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

