Ajwain Leaves | మన వంట ఇంటి పోపు దినుసుల్లో వాము కూడా ఒకటి. ఇది ఎంతో సువాససను కలిగి ఉంటుంది. దీన్ని కూరల్లో వేస్తే మంచి రుచి, వాసన వస్తాయి. అయితే కేవలం వాము గింజలు మాత్రమే కాదు, మనకు వాము ఆకులు కూడా లభిస్తాయి. ఈ మొక్క చాలా మంది ఇళ్లలో పెరుగుతూనే ఉంటుంది. కానీ దీన్ని వాము ఆకు మొక్క అని ఎవరూ గుర్తు పట్టి ఉండరు. ఈ మొక్క ఆకులను కూడా మనం పలు వ్యాధులను తగ్గించేందుకు ఉపయోగించవచ్చు. వాము ఆకుల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది. దీంతో అనేక లాభాలు పొందవచ్చని వైద్యులు అంటున్నారు.
వాము ఆకులను నేరుగా అలాగే నమిలి తినవచ్చు. దీంతో పొట్టలో ఉండే అసౌకర్యం తగ్గుతుంది. కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వాము ఆకుల్లో థైమోల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణాశయ ఎంజైమ్లు, జీర్ణ రసాలు సరిగ్గా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీని వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. అజీర్తి తగ్గుతుంది. కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. వాము ఆకులను తినడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. కొందరు ఆహారం అతిగా తింటారు. దీంతో బరువు పెరుగుతారు. అయితే ఈ సమస్య నుంచి బయట పడాలంటే వాము ఆకులను రోజూ నమిలి తింటుండాలి. దీంతో ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. వాము ఆకులను నమలడం వల్ల అతిగా తినడం అనే సమస్య తగ్గుతుంది. బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు ఈ ఆకులను తింటుంటే ఫలితం ఉంటుంది.
వాము ఆకులు దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. గొంతు, ఊపిరితిత్తులలో ఉండే కఫాన్ని కరిగిస్తాయి. దీంతో ఊపిరితిత్తులకు గాలి సరిగ్గా లభిస్తుంది. శ్వాసనాశాలు క్లియర్ అవుతాయి. శ్వాసకోశ సమస్యల నుంచి బయట పడవచ్చు. గొంతులో గరగర, నొప్పి, మంట ఉన్నవారు వాము ఆకులను నీటిలో వేసి మరిగించి తాగుతుంటే ఫలితం ఉంటుంది. ఆస్తమా ఉన్నవారు ఈ నీళ్లను తాగుతుంటే సత్వరమే ఉపశమనం లభిస్తుంది. వాము ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. కనుక ఈ ఆకులను నోట్లో వేసుకుని నమిలి తింటుంటే నోట్లోని బ్యాక్టీరియా నశిస్తుంది. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. నోటి సమస్యలు కూడా తగ్గుతాయి. నోట్లోని పుండ్లు నయమవుతాయి.
వాయు ఆకుల్లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. దీని వల్ల ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. వాము ఆకులను మొటిమలను తగ్గించేందుకు కూడా ఉపయోగించవచ్చు. ఈ ఆకులను మెత్తని పేస్టులా చేసి ముఖానికి రాస్తుంటే ముఖంపై ఉండే మొటిమలు, ముడతలు, మచ్చలు పోతాయి. ముఖం కాంతివంతంగా మారి మెరుస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు. శిరోజాల సంరక్షణకు కూడా ఈ ఆకులను ఉపయోగించవచ్చు. ఈ ఆకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు శిరోజాలను సంరక్షిస్తాయి. చుండ్రు, దురద వంటి సమస్యలను తగ్గిస్తాయి. జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరిగేలా చేస్తాయి. వాము ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్ల నుంచి సురక్షితంగా ఉండవచ్చు. ఇలా వాము ఆకులను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.