మన చుట్టూ పరిసరాల్లో అనేక రకాల మొక్కలు పెరుగుతుంటాయి. వాటిల్లో ఔషధ గుణాలు ఉండే మొక్కలు చాలానే ఉన్నాయి. కానీ వాటి గురించి చాలా మందికి తెలియదు. వాటిని చూస్తే చాలా మంది పిచ్చి మొక్కలని అనుకుంటారు.
మన వంట ఇంటి పోపు దినుసుల్లో వాము కూడా ఒకటి. ఇది ఎంతో సువాససను కలిగి ఉంటుంది. దీన్ని కూరల్లో వేస్తే మంచి రుచి, వాసన వస్తాయి. అయితే కేవలం వాము గింజలు మాత్రమే కాదు, మనకు వాము ఆకులు కూడా లభిస్తాయి.
అనేక ఆరోగ్య సమస్యలకు వాము మంచి పరిష్కారమని మనకు తెలుసు. అయితే, వాము ఆకుతో కూడా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. వాము మొక్కను అజ్వైన్, బిషప్ వీడ్, క్యారమ్ అని కూడా పిలుస్తారు,