అనేక ఆరోగ్య సమస్యలకు వాము మంచి పరిష్కారమని మనకు తెలుసు. అయితే, వాము ఆకుతో కూడా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. వాము మొక్కను అజ్వైన్, బిషప్ వీడ్, క్యారమ్ అని కూడా పిలుస్తారు, ఈ వాము.. ఆసియా ఖండంలో బాగా పెరిగే ఒక మొక్క. వామును సుగంధ ద్రవ్యంగా ఉపయోగిస్తాం. దీంతో అపారమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ మొక్క మంచితనం అంతటితో ఆగదు.. ఎందుకంటే వాము ఆకులు కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉపయోగపడతాయి.
1. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది..
వాము ఆకు జీర్ణక్రియ సంబంధ సమస్యలకు చెక్ పెడుతుంది. జీర్ణ సంబంధ సమస్యలు చాలా అసౌకర్యంగా, బాధించేవిగా ఉంటాయి. అయితే, వాము ఆకులను తీసుకుంటే జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కడుపునొప్పి, మలబద్ధకంలాంటి సమస్యలను ఎదుర్కొనేందుకు సహాయపడుతుంది.
2. ఫ్లూ లక్షణాల నుంచి ఉపశమనం..
ప్రతిరోజూ వాము ఆకులను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గులాంటి ఫ్లూ లక్షణాలనుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరానికి వివిధ ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి లభిస్తుంది.
3. నోటి ఆరోగ్యాన్ని పెంచుతుంది..
నోటి దుర్వాసన కొంతమందిని వేధిస్తూ ఉంటుంది. వీరితో మాట్లాడేందుకు ఎవరూ ఇష్టపడరు. అయితే, వాము ఆకులతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఈ వాము ఆకులు అద్భుతమైన మౌత్ ఫ్రెష్నింగ్ సామర్ధ్యాలను కలిగి ఉంటాయి. నోటి ఆరోగ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడుతాయి.
వాము ఆకులను ఎలా తీసుకోవాలంటే?