Air Pollution | వాయు కాలుష్యంతో దీర్ఘకాలం పాటు మైగ్రేన్ తలనొప్పులు.. సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడి..
వాయు కాలుష్యం కేవలం శ్వాసకోశ సమస్యలకే కాదు, తీవ్రమైన తలనొప్పులైన మైగ్రేన్లకు కూడా కారణమవుతుందనే విషయాన్ని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా కాలుష్య స్థాయులు పెరిగే రోజుల్లో మైగ్రేన్ ఎక్కువయ్యే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, తేమ వంటి అంశాలు కూడా ఈ ప్రభావాన్ని మరింత పెంచుతున్నాయని అధ్యయనం సూచిస్తోంది.
Air Pollution | వాయు కాలుష్యం కేవలం శ్వాసకోశ సమస్యలకే కాదు, తీవ్రమైన తలనొప్పులైన మైగ్రేన్లకు కూడా కారణమవుతుందనే విషయాన్ని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా కాలుష్య స్థాయులు పెరిగే రోజుల్లో మైగ్రేన్ ఎక్కువయ్యే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, తేమ వంటి అంశాలు కూడా ఈ ప్రభావాన్ని మరింత పెంచుతున్నాయని అధ్యయనం సూచిస్తోంది. ఈ పరిశోధనలో మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్న 7 వేల మందికి పైగా వ్యక్తులను సుమారు 10 సంవత్సరాల పాటు పరిశీలించారు. వీరు నివసించే ప్రాంతాల్లో ట్రాఫిక్, పరిశ్రమలు, ధూళి తుఫాన్ల వల్ల ఏర్పడే వాయు కాలుష్య స్థాయిలు, అలాగే వాతావరణ పరిస్థితులను విశ్లేషించారు.
కాలుష్యం స్థాయిలు అధికంగా ఉంటే..
పరిశోధనలో పాల్గొన్నవారు ఎప్పుడు ఆసుపత్రులు లేదా క్లినిక్‌లను మైగ్రేన్ చికిత్స కోసం సందర్శించారో నమోదు చేసి, ఆ రోజుల్లో ఉన్న కాలుష్య స్థాయిలతో పోల్చారు. కాలుష్య ప్రభావం శరీరంపై కొన్ని రోజుల తరువాత కూడా కనిపించవచ్చని భావించి, సంఘటనకు ముందు ఏడురోజుల డేటాను కూడా పరిశీలించారు. అధ్యయన కాలంలో ఆసుపత్రి సందర్శనలు అత్యధికంగా నమోదైన రోజుల్లో గాల్లో ఉన్న పీఎం10 స్థాయిలు సగటుతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. సాధారణంగా 57.9 మైక్రాన్లు ప్రతి క్యూబిక్ మీటరుకు ఉండగా, అత్యధిక మైగ్రేన్ కేసులు నమోదైన రోజుల్లో ఇది 119.9 మైక్రాన్లకు చేరింది. అదేవిధంగా సూక్ష్మ కాలుష్య కణాలైన పీఎం 2.5 స్థాయులు కూడా ఎక్కువగా నమోదయ్యాయి. ఈ కణాలకు దీర్ఘకాలంగా గురైన వ్యక్తులు మైగ్రేన్ మందులను ఎక్కువగా వినియోగించే అవకాశం 9 శాతం అధికంగా ఉన్నట్లు తేలింది. ట్రాఫిక్ కాలుష్యంతో విడుదలయ్యే నైట్రోజన్ డయాక్సైడ్ (ఎన్వో2) స్థాయిలు కూడా మైగ్రేన్ తీవ్రతతో సంబంధం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఎన్వో2 స్థాయిలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే వారు మైగ్రేన్ మందుల వినియోగంలో 10 శాతం ఎక్కువ అవకాశాన్ని చూపించారు.
కాలుష్యం తగ్గితే..
అత్యల్ప ఆసుపత్రి సందర్శనలు నమోదైన రోజుల్లో గాలి కాలుష్యం కూడా తక్కువగానే ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. ఇది వాయు కాలుష్యం, మైగ్రేన్ల మధ్య ఉన్న సంబంధాన్ని మరింత బలపరుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాతావరణ పరిస్థితులు కూడా కాలుష్య ప్రభావాన్ని పెంచుతున్నాయని అధ్యయనం తెలిపింది. అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ తేమ ఉన్న సమయంలో NO2 ప్రభావం ఎక్కువగా ఉండగా, చల్లని, అధిక తేమ ఉన్న పరిస్థితుల్లో పీఎం2.5 ప్రభావం తీవ్రమవుతుందని గుర్తించారు. వాతావరణ మార్పుల కారణంగా వేడి తరంగాలు, ధూళి తుఫాన్లు, కాలుష్య ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో మైగ్రేన్ బాధితులు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అధిక కాలుష్యం ఉన్న రోజుల్లో బయట తిరగడం తగ్గించడం, ఇంట్లో గాలి శుద్ధి పరికరాలు ఉపయోగించడం, మైగ్రేన్ లక్షణాలు కనిపించిన వెంటనే మందులు ప్రారంభించడం వంటి చర్యలు ఉపశమనానికి దోహదపడతాయని సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Air pollution
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | టాస్ గెలిచిన వెస్టిండీస్.. ఆ 11 మందితోనే బరిలోకి టీమిండియా..!
‘పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి’
MP Vaddiraju Ravichandra | ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే తప్పుకోవాలి : ఎంపీ వద్ది రాజు రవిచంద్ర
JNU professor | జేఎన్‌యూలో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రొఫెసర్‌ను డిస్మిస్ చేసిన యూనివర్సిటీ
SA vs AUS | నిప్పులు చెరుగుతున్న సఫారీలు.. పీకల్లోతు కష్టాల్లో వరల్డ్ నంబర్ 1..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

