Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’ టాస్క్.. నామినేషన్స్‌లో ఆరుగురు!
Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఆట మరింత ఆసక్తికరంగా మారుతోంది. ప్రస్తుతం హౌస్‌లో కొనసాగుతున్న ‘బీబీ హోటల్’ టాస్క్‌తో కంటెస్టెంట్ల మధ్య పోటీ రసవత్తరంగా సాగుతోంది. ఈ టాస్క్‌లో భాగంగా రెడ్ జోన్ సభ్యులు హోటల్ వర్కర్లుగా, ఎల్లో జోన్ సభ్యులు హోటల్ యజమానులుగా, గ్రీన్ జోన్ కంటెస్టెంట్లు అతిథులుగా వ్యవహరిస్తున్నారు.
Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఆట మరింత ఆసక్తికరంగా మారుతోంది. ప్రస్తుతం హౌస్‌లో కొనసాగుతున్న ‘బీబీ హోటల్’ టాస్క్‌తో కంటెస్టెంట్ల మధ్య పోటీ రసవత్తరంగా సాగుతోంది. ఈ టాస్క్‌లో భాగంగా రెడ్ జోన్ సభ్యులు హోటల్ వర్కర్లుగా, ఎల్లో జోన్ సభ్యులు హోటల్ యజమానులుగా, గ్రీన్ జోన్ కంటెస్టెంట్లు అతిథులుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ మరో కొత్త ఆటను ప్రవేశపెట్టి హౌస్‌లో సందడి పెంచారు. ‘బీబీ హోటల్’ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్లకు ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’ ఆటను నిర్వహించారు. రెండు జట్లుగా విడిపోయిన సభ్యులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఒక్కో జట్టులో ఒక యజమాని, ఇద్దరు వర్కర్లు చొప్పున ఉండేలా ఏర్పాట్లు చేశారు. డైస్‌ను తిప్పి వచ్చిన సంఖ్య ఆధారంగా పటంపై ముందుకు కదులుతూ గెలుపు కోసం పోటీపడ్డారు.
ఈ ఆటలో గెలుపోటములతో పాటు మధ్యలో వచ్చిన ఫన్నీ పనిష్మెంట్లు ప్రేక్షకులను నవ్వించాయి. ఒక సందర్భంలో సుధీర్ తలకిందులుగా కొంతసేపు ఉండాల్సి రావడంతో హౌస్‌లో నవ్వులు పూశాయి. మరోవైపు వంశీ ఓల్డ్ ఫారిన్ మ్యాన్ తరహాలో నటిస్తూ తనదైన శైలిలో అలరించాడు. వంశీ, శ్వేత కలిసి చేసిన కామెడీ కూడా కంటెస్టెంట్లను నవ్వించింది. టాస్కుల ఒత్తిడి మధ్య ఈ సరదా సన్నివేశాలు హౌస్ వాతావరణాన్ని మార్చేశాయి. బీబీ హోటల్ టాస్క్ ముగిసే సమయానికి అత్యధిక స్టార్లు సాధించిన రామ్ ప్రసాద్, వర్షిణి రెడ్ జోన్ నుంచి నేరుగా గ్రీన్ జోన్లోకి చేరుకున్నారు. దీంతో వీరిద్దరికీ ఊరట లభించింది. మరోవైపు వంశీ ఎక్కువ డబ్బులు సాధించడంతో రెడ్ జోన్ నుంచి ఎల్లో జోన్‌కు మారాడు. జోన్లలో వచ్చిన ఈ మార్పులతో హౌస్‌లో సమీకరణాలు మారిపోయాయి.
ప్రస్తుత వారం నామినేషన్స్‌లో రోహిత్, వంశీ, దేబ్జానీ, శివ, సుధీర్, ఝాన్సీ ఉన్నారు. వీరిలో ఎవరు హౌస్‌ను వీడతారనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. గత వారం డబుల్ ఎలిమినేషన్‌తో షాలినీ పటేల్ హౌస్ నుంచి బయటకు వెళ్లగా, ఈ వారం కూడా ఎలిమినేషన్‌పై ఆసక్తి పెరిగింది. మొత్తానికి ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’ ఆటతో కంటెస్టెంట్లు సరదాగా గడిపినప్పటికీ, జోన్ల మార్పులు, నామినేషన్లతో పోటీ మరింత తీవ్రమైంది. గ్రీన్ జోన్లోకి చేరిన రామ్ ప్రసాద్, వర్షిణి సేఫ్‌గా ఉండగా.. నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో ఈ వారం ఎవరు బయటకు వెళ్తారో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’ టాస్క్.. నామినేషన్స్‌లో ఆరుగురు!
BTech Admissions | ఇంజినీరింగ్ చదువుకు తగ్గుతున్న క్రేజ్.. భారీగా తగ్గుతున్న బీటెక్ అడ్మిషన్లు
Israel Results | ఇజ్రాయెల్‌లో తుది ఫలితాలు వెల్లడి.. ఏ పార్టీకీ దక్కని మెజారిటీ.. ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యమేనా..!
SIR Enumeration | తెలంగాణలో ‘సర్’ షెడ్యూల్ పొడిగింపు
రేవంత్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి వివాదంలో కీలక మలుపు.. రేడియల్ రోడ్ల టెండర్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

