Ageing Habits | వయస్సు మీద పడుతున్న కొద్దీ సహజంగానే ఎవరికైనా సరే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తుంటాయి. ముఖంపై ఎక్కువగా ముడతలు వస్తుంటాయి. దీంతో చాలా మంది హైరానా పడుతుంటారు. త్వరగా వయస్సు వచ్చేసిందని ఫీలవుతుంటారు. 50 ఏళ్లు నిండితే చర్మం ముడతలు పడితే ఫర్వాలేదు. కానీ కొందరికి చిన్న వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తుంటాయి. దీంతో వారిలో ఆందోళన మొదలవుతుంది. అయితే నిజానికి మనం రోజూ పాటించే జీవనశైలి, తీసుకునే ఆహారాలే మనకు ఇలాంటి సమస్యలను తెచ్చి పెడతాయి. ముఖ్యంగా మనం రోజూ చేసే కొన్ని రకాల పనుల వల్లే మనకు త్వరగా వృద్ధాప్య ఛాయలు వస్తాయి. అయితే ఎందుకు ఇలా జరుగుందో తెలుసుకుంటే ముందుగానే సమస్యను నివారించవచ్చు. దీంతో వృద్ధాప్య ఛాయలు రాకుండా చూసుకోవచ్చు.
ప్రస్తుతం చాలా మంది నిత్యం అనేక సందర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మనకు వస్తున్న అనేక ఆరోగ్య సమస్యలకు మూల కారణం ఒత్తిడే అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి అధికంగా ఉంటే శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ లెవల్స్ పెరిగిపోతాయి. ఇది మన ఆరోగ్యంపై నెగెటివ్‌గా ప్రభావం చూపే హార్మోన్. దీంతో వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయి. కనుక ఒత్తిడి లేని జీవితం గడపాలి. అందుకు గాను యోగా, మెడిటేషన్ చేయాలి. రోజూ పచ్చని ప్రకృతిలో కాసేపు గడపాలి. మీకు ఇష్టమైన సంగీతం కాసేపు వినాలి. పుస్తక పఠనం చేయవచ్చు. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే సరదాగా వారితో కాసేపు ఆడుకోండి. మీ ఒత్తిడి మొత్తం మటుమాయం అవుతుంది. దీంతో వృద్ధాప్య ఛాయలు రాకుండా చేయవచ్చు.
కొందరికి ఎల్లప్పుడూ నెగెటివ్ ఆలోచనలే అధికంగా వస్తుంటాయి. రోజూ అన్ని విషయాల్లోనూ నెగెటివ్ ఆలోచనలే చేస్తుంటారు. ఏ పని చేసినా అందులో పాజిటివ్ కోణాన్ని వెదకరు. నెగెటివ్ ఆలోచననే చేస్తారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మీరు ఏ పని చేస్తున్నా రిజల్ట్ పాజిటివ్‌గానే వస్తుందని ఫిక్స్ అవ్వాలి. పాజిటివ్ దృక్పథంతోనే ఉండాలి. దీంతో ఆరోగ్యం మెరుగు పడుతుంది. మీరు ఎంత ఎక్కువ నెగెటివ్ ఆలోచనలు చేస్తే మీకు అంత త్వరగా వృద్ధాప్య చాయలు వస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎల్లప్పుడూ పాజిటివ్ ఆలోచనలే చేయాలి. అలాగే రోజూ కనీసం 7 నుంచి 8 గంటలు నిద్ర పోయేలా ప్లాన్ చేసుకోవాలి. నిద్ర సరిగ్గా లేకపోయినా కూడా త్వరగా వృద్ధాప్య ఛాయలు వస్తాయి. రాత్రి పూట పాలలో తేనె కలిపి తాగినా లేదా పడుకునే ముందు కాసేపు పుస్తకాలను చదివినా ఫలితం ఉంటుంది. చక్కగా నిద్ర పడుతుంది. సరిగ్గా నిద్రపోతే మీ వయస్సును వెనక్కి మళ్లించవచ్చు.
రోజంతా ఎండలో తిరిగినా కూడా చర్మానికి మంచిది కాదు. రోజుకు కనీసం 20 నిమిషాలు విటమిన్ డి కోసం సూర్యరశ్మిలో ఉండవచ్చు. కానీ అంతకు మించి ఎండలో తిరగరాదు. దీని వల్ల చర్మం త్వరగా ముడతలు పడుతుంది. వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తాయి. అలాగే ధూమపానం మానేయాలి. ఇది కూడా త్వరగా వృద్ధాప్యం వచ్చేలా చేస్తుంది. జంక్ ఫుడ్, నూనె పదార్థాలు, కొవ్వు ఆహారం అతిగా తింటున్నా కూడా త్వరగా వృద్ధాప్య చాయలు వస్తాయి. ఇవి చర్మాన్ని త్వరగా నాశనం చేస్తాయి. దీంతో త్వరగా వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. కాబట్టి ఈ ఆహారాలను మానేయాలి. అలాగే మద్యం సేవించకూడదు. రోజుకు తగినన్ని నీళ్లను కూడా తాగాలి. ఈ విధమైన సూచనలు పాటిస్తే మీ చర్మంపై వచ్చే ముడతలను పోగొట్టవచ్చు. మీ వయస్సును వెనక్కి మళ్లించి యవ్వనంగా కనిపించవచ్చు. వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకోవచ్చు.