Exercise | వర్షం పడుతుందని వాకింగ్ మానేస్తున్నారా? వీటితో ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేసుకోండి
Exercise | నిజమే, వాకింగ్‌కు బయల్దేరే ముందే చినుకులు మొదలవుతాయి. జిమ్‌కు వెళ్దాం అనుకోగానే కుండపోత వర్షం. దీంతో ఇంటికే పరిమితం అవుతాం. పకోడీలు, కాఫీచాయ్ల డోస్ పెరిగిపోతుంది. ఈ బద్ధకాన్ని వదిలించుకోవాల్సిందే. లేదంటే లావైపోతాం.

ట్రెడ్మిల్, స్పిన్ సైకిల్ లాంటి వాటిని నెలవారీగా అద్దెకిచ్చే సంస్థలు ఉన్నాయి.
యోగా చేసుకోడానికి ఒక బెడ్‌షీట్ సరిపోతుంది.
స్కిప్పింగ్‌కు తాడు చాలు.
ఉన్న చోటనే జాగింగ్ చేసుకునే టెక్నిక్స్ ఉన్నాయి. కావాలంటే, ఆన్లైన్లో చూడండి.
పుషప్స్‌కు ఎలాంటి సాధనమూ అవసరం లేదు. నాలుగు గోడల మధ్య చేసే వ్యాయామం కూడా.. ఆరుబయట కసరత్తుతో సమానమైన ఫలితాలను ఇస్తుంది. ఒత్తిడిని దూరం చేసే ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. డిప్రెషన్‌ను అధిగమించ వచ్చు. కండరాలు, ఎముకలు బలపడతాయి. జీవక్రియ చైతన్యవంతం అవుతుంది. మారిన ప్రతి రుతువూ మనసును ప్రభావితం చేస్తుంది. దీన్నే సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (సాడ్) అంటారు. వ్యాయామంతో ఈ పరిస్థితిని దాటేయవచ్చు. కాబట్టి, చినుకులను సాకుగా చూపించి.. ముడుచుకుని పడుకోకండి. నిద్ర లేవండి. మీ గదినే జిమ్‌గా మార్చుకోండి.