e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, April 11, 2021
Advertisement
Home ఆరోగ్యం ఆరోగ్యానికి..ప్రకృతి సూత్రం

ఆరోగ్యానికి..ప్రకృతి సూత్రం

ఆరోగ్యానికి..ప్రకృతి సూత్రం


సరైన తిండితోనే శరీరంలోని జీవక్రియలన్నీ సజావుగా జరుగుతాయి. ఆరోగ్యకరమైన జీవనశైలికి ఆధారమైన ఇలాంటి అంశాల చుట్టూనే ప్రకృతి చికిత్సలు ఉంటాయి.
నీళ్లు
రక్తప్రసరణలో భాగంగా మన శరీర జీవక్రియల ద్వారా తయారైన వ్యర్థాలు, హానికర పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. ఇందుకోసం తగినన్ని నీళ్లు అవసరం. నీటివల్ల శరీర ఉష్ణోగ్రత తగినట్టుగా ఉంటుంది. మల, మూత్ర విసర్జనలు సాఫీగా సాగుతాయి.
ఆహారం
ప్రకృతి వైద్యం ప్రకారం ఆహారమే ప్రధాన ఔషధం. రోజుకు రెండుసార్లు తినేవాళ్లను మితాహారులంటారు. ఆ ఆహారం నాణ్యంగా ఉండటమూ ముఖ్యమే. ఆకలి అయినప్పుడు మాత్రమే తినాలి. కడుపులో మూడు భాగాలు నాణ్యమైన ఆహారంతో, నీటితో నింపాలి. నాలుగో భాగం ఖాళీగా ఉంచాలి.
ఉపవాసం
ఉపవాసం ద్వారా జీర్ణవ్యవస్థకు విశ్రాంతి దొరుకుతుంది. ఉపవాసం మనసులోని మాలిన్యాలను కూడా తొలగిస్తుంది. ఆ సమయంలో చిత్తం ప్రశాంతంగా ఉంటుంది.
వ్యాయామం
వ్యాయామం రోజువారీ జీవితంలో భాగం కావాలి. యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం అన్నీ కలిపితేనే సంపూర్ణ యోగా అవుతుంది. దీనివల్ల కీళ్లన్నీ ఫ్లెక్సిబుల్‌ అవుతాయి. బరువు నియంత్రణలో ఉంటుంది. వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
ప్రార్థన
ప్రార్థన కూడా ప్రకృతి వైద్య సూత్రమే. మనసును స్వచ్ఛం చేస్తుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటేనే శారీరక వ్యాధులు దూరమవుతాయి. హార్మోన్లు సమతుల్యమవుతాయి.
-డాక్టర్‌ మాలతి శ్యామల,ప్రకృతి వైద్య నిపుణులు

Advertisement
ఆరోగ్యానికి..ప్రకృతి సూత్రం

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement