తుంగభద్రమ్మకు నదీ హారతి

అలంపూర్ : తుంగభద్ర పుష్కరాల్లో భాగంగా అలంపూర్ పుష్కర ఘాట్ వద్ద మంగళవారం శాస్త్రోక్తంగా సం ప్రదాయ రీతిలో నదీహారతి నిర్వహించారు. కార్యక్రమం లో ఆలయాల పాలక మండలి చైర్మన్ రవి ప్రకాశ్‌గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ, వైస్ చైర్మన్ శేఖర్‌రెడ్డి, ఈవో ప్రేమ్‌కుమార్‌రావు పాల్గొన్నారు.
ఆలయాలను దర్శించుకున్న ప్రముఖులు
పుష్కరాల సందర్భంగా జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను మంగళవారం ఏపీ అటవీశాఖ మం త్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి శశిదేవి కుటుంబ స మేతంగా దర్శించుకున్నారు. కార్యక్రమంలో విద్యుత్‌శాఖ డీఈ శ్రీధర్‌రెడ్డి, ఏడీఈ నర్సింహప్రసాద్ ఉన్నారు.
భక్తుల సేవార్థం ఉచిత సర్వీసులు
పుష్కరాలకు వచ్చే భక్తులు ఉచిత బస్సు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ మ నోరమ పేర్కొన్నారు. మంగళవారం అలంపూర్ టెంపుల్ వద్ద మున్సిపల్ చైర్ పర్సన్, ఏఎస్పీ కృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్ రవి ప్రకాశ్‌గౌడ్‌లతో కలిసి బస్సును ప్రారంభించా రు. భక్తులు వాహన పార్కింగ్ నుంచి పుష్కరఘాట్ వర కు వెళ్లేందుకు వీలుగా మూడు మినీ బస్సులు ఏర్పాటు చేశామన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ఒకటి, ఆలయ కమిటీ నుంచి ఒకటి, మారమునగాల గ్రామానికి చెందిన కృష్ణగౌడ్ మరో బస్సును సమకూర్చారు.
నేడు లక్ష తులసీ అర్చన
ఉండవెల్లి : పుల్లూరు పుష్కరఘాట్‌లో బుధవారం లక్ష తులసీ అర్చన కార్యక్రమాన్ని శ్రీ జ్యోతిర్వస్తు విద్యాపీఠం, గ్రామపెద్దల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పండితు లు తెలిపారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా నుంచి వేదపండితులు సరస్వతి అమ్మవారిని పుష్కర ఘాట్ వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. లక్ష తు లసీ అర్చనలో భాగంగా జ్యోతిర్వస్తు పీఠం సిద్ధ్దాంత భా స్కర శ్రీ మహేశ్వర శర్మచే ఉదయం ప్రభాత సంకీర్తన, 6 గంటలకు పుష్కర స్నాన మహాసంకల్పం, 6:26కు సరస్వతీ అమ్మవారికి పుష్కరస్నానం, 9 గంటలకు అమ్మవా రి యాత్ర, దేవతా దర్శనం, 10 గంటలకు లక్ష తులసీ అ ర్చన, 11:30కు పుష్కర స్నాన మహిమ ప్రవచనం, మ ధ్యాహ్నం 12:30కు మహా మంగళహారతి ఉంటుందన్నారు.
తాజావార్తలు
- రోజు విడిచి రోజు నీరు: ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్
- బాలల పరిరక్షణకు చర్యలు
- మౌలిక వసతుల కల్పనకు కృషి
- రేణుకా ఎల్లమ్మదేవి కల్యాణ మహోత్సవం
- లాఠీ..సీటీతో చెత్తపై సమరం!
- ఏప్రిల్ 13 నుంచి భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు
- ఓటుహక్కు ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత
- కొత్త బార్లకు ప్రభుత్వం అనుమతి
- శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు 20 వేలు
- రేపు ఉద్యోగులతో త్రిసభ్య కమిటీ భేటీ?