బియ్యం సరఫరా చేయాలి

- కలెక్టర్ శృతిఓఝా
గద్వాల : యాసంగి సీజన్లో రైస్ మిల్లులకు సరఫరా చేసిన ధాన్యం ఈ నెల చివరి నాటికి రైస్ మిల్లుల్లో బియ్యం ఆడించి పౌరసరఫరాల శాఖకు సరఫరా చేయాలని కలెక్టర్ శృతిఓఝా రైస్ మిల్లుల యజమానులకు ఆదేశించారు.
శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రైస్ మిల్లుల, బాయిల్డ్ మిల్లర్లతో సీఎంఆర్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత యాసంగి సీజన్లో సేకరించిన ధాన్యాన్ని రైస్‌మిల్లుల, బాయిల్డ్ రైస్ మిల్లుల నిర్వాహకులు ఈ నెల చివరి నాటికి అందించాలన్నారు. జిల్లాలోని మూడు బాయిల్డ్ రైస్ మిల్లులు, ఎనిమిది రైస్ మిల్లుల్లో ధాన్యం ఆడించి బియ్యాన్ని సకాలంలో పంపిణీ చేయాలన్నారు. యాసంగి సీజన్లో మూడు బాయిల్డ్ మిల్లులకు 27218.600 సీకేస్ (వేయి బస్తాలకు ఒక సీకేఎస్) ధాన్యం సరఫరా చేయగా ఇప్పటి వరకు 5655 సీకేఎస్ల బియ్యం సరఫరా చేశారని మిగిలిన 12853.648 బియ్యం ఈ నెల చివరి నాటికి అందించాలని ఆదేశించారు.
అలాగే ఎనిమిది రైస్ మిల్లులకు సంబంధించి 8119.680 సీకేఎస్ల వరి ధాన్యానికి గానూ 5022 సీకేఎస్లు అందజేశారని మిగిలిన 418.186సీకేఎస్ల బియ్యం ఈ నెల చివరి నాటికి అందించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డీటీ కేశవులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జిల్లాలో కురిసే భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నందున అధికారులు తగు జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ శృతిఓఝా అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురిసి వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయని అలాంటి ప్రాంతల్లో ప్రజలు సంచరించకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో పలు వాగులు, వంకలు ప్రమాదకరంగా మారినందున వాగుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో పురాతన ఇండ్లల్లో నివసించే ప్రజలు పునరావాసానికి గాను ప్రభుత్వ పాఠశాల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీహర్ష, జెడ్పీసీఈవో ముసాయిదాబేగం, డీపీవో కృష్ణ,ఆర్డీవో రాములు, పీఆర్ ఈఈ మమత పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఆమె రాజకీయ ఆటలోపడి లక్ష్యాలు మరిచారు: దినేశ్ త్రివేది
- తుపాకీ లైసెన్స్ ఇవ్వండి.. పోలీసులకు హత్రాస్ యువతి విజ్ఞప్తి
- భారీ మెజారిటీతో ‘పల్లా’ను ఎమ్మెల్సీగా గెలిపించాలి : మంత్రి ఎర్రబెల్లి
- కేటీఆర్ పీఏనంటూ మోసాలు.. రంజీ మాజీ క్రికెటర్ అరెస్ట్
- రష్మీ హాట్ అందాలకు యువత దాసోహం
- టెస్ట్ అరంగేట్రానికి 50 ఏండ్లు.. గవాస్కర్‌ను సత్కరించిన బీసీసీఐ
- అతను తెలియక తప్పు చేశాడు: బీహార్ సీఎం
- బీజేపీలోకి నటుడు మిథున్ చక్రవర్తి?
- ఇన్‌కం టాక్స్ దాడులపై స్పందించిన హీరోయిన్ తాప్సీ
- బుమ్రా, అనుపమ పెళ్లిపై వచ్చిన క్లారిటీ..!