బుధవారం 05 ఆగస్టు 2020
Gadwal - Aug 01, 2020 , 08:26:57

సోడియం హైపో క్లోరైట్‌ ద్రావణం పిచికారీ

సోడియం హైపో క్లోరైట్‌  ద్రావణం పిచికారీ

మల్దకల్‌ : మండల కేంద్రంలో పలు కాలనీల్లో పారిశుధ్య సిబ్బంది సోడియం హైపో కోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. మండల కేంద్రంలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో తాసిల్దార్‌ అజంఅలీ శుక్రవారం  వారి ఇండ్ల వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులు 15 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. అలాగే వారికి ప్రతి రోజూ మందులు పం పిణీ చేయాలని తగు జాగ్రత్తలు సూచించాలని మండల వైద్యాధికారిణి సునీతను ఆదేశించారు. కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్‌, తిమ్మరాజు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.


logo