గురువారం 02 జూలై 2020
Food - Jun 23, 2020 , 16:38:34

బ్రేక్‌ఫాస్ట్ తిన‌కుంటే లావైపోతారు జాగ్ర‌త్త‌!

బ్రేక్‌ఫాస్ట్ తిన‌కుంటే లావైపోతారు జాగ్ర‌త్త‌!

ప్ర‌తిరోజూ తీసుకునే ఆహారంలో అత్యంత కీల‌క పాత్ర పోషిస్తుంది. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేస్తే లేనిపోని రోగాల‌న్నీ వ‌స్తాయి. రోజును ఉత్సాహంగా ప్రారంభించాలంటే బ్రేక్‌ఫాస్ట్ త‌ప్ప‌నిస‌రి. కానీ ఈ బిజీ లైఫ్‌లో తీరిక లేక చాలామంది అల్పాహారం తిన‌డం మానేస్తున్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. బ్రేక్‌ఫాస్ట్ తిన‌కుంటే జ‌రిగే అన‌ర్థాలు గురించి త‌ప్ప‌కుండా అంద‌రూ తెలుసుకోవాలి. 

* అల్పాహారం తీసుకోక‌పోతే శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. ఎక్కువ‌గా బ‌రువు పెరిగే అవ‌కాశం కూడా ఎక్కువ‌గా ఉంటుంది. 

* బ్రేక్‌ఫాస్ట్ తిన‌కుంటే మెద‌డు కూడా మొద్దుబారిపోతుంది. అల్పాహారం మెద‌డుకు గ్లూకోజ్‌గా ప‌నిచేస్తుంది. తిన‌క‌పోవ‌డం వ‌ల్ల ప‌ని ప‌ట్ల ఆస‌క్తి త‌గ్గిపోతుంది.   

* బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తే మ‌ధుమేహం వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. దీంతోపాటు అధిక ర‌క్త‌పోటు, కొలెస్ట్రాల్ పెరుగ‌డానికి కార‌ణ‌మ‌వుతుంది. 

* ఈ స‌మ‌స్య‌ల‌తో గుండెపోటుకు దారితీస్తుంది. 

* ముఖ్యంగా మ‌హిళ‌లు బ్రేక్‌ఫాస్ట్ తిన‌కుండా అస‌లు ఉండ‌కూడ‌దు. ఇలా చేయ‌డం వ‌ల్ల నెల‌స‌రి స‌రిగ్గా రాక‌పోవ‌డం లాంటి స‌మ‌స్య‌లు కూడా ఎదుర‌వుతాయ‌ని ఓ స‌ర్వేలో వెల్ల‌డైంది.  

* బ్రేక్‌ఫాస్ట్ తినేట‌ప్పుడు రోజుకో స‌మ‌యం కాకుండా ప్ర‌తిరోజూ ఒక స‌మ‌యాన్నే ఫాలో అవ్వాలి. లేదంటే గ్యాస్ట్రిక్ స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. 


logo