ఓటిటి దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ మంగళవారం నుంచి భారత్‌లో తన కస్టమర్ల కోసం సబ్స్క్రిప్షన్ ధరలు భారీగా తగ్గించింది. తన కస్టమర్ బేస్‌ని పెంచుకునేందుకే నెట్‌ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచ ఓటిటి మార్కెట్లో సింహ భాగం నెట్‌ఫ్లిక్స్ సొంతమైనప్పటికీ.. ఇండియాలో మాత్రం డిస్నీ హాట్ స్టార్ , అమెజాన్ ప్రైమ్లదే పైచేయి.
నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు
నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్
కొత్త ధర – రూ.199 (పాత ధర – రూ.499)
నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ఓన్లీ ప్లాన్
కొత్త ధర – రూ.149 (పాత ధర – రూ.199)
నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ ప్లాన్
కొత్త ధర – రూ.499 (పాత ధర – రూ.649)
నెట్‌ఫ్లిక్స్ ప్రీమియమ్ ప్లాన్
కొత్త ధర – రూ.649 (పాత ధర – రూ.799)