చీమలన్నీ కలిసి
పాములకు వణుకు పుట్టించినయ్
గడ్డిపోచలన్నీ కలిసి
అహంకారాన్ని బంధించినయ్!
ఎడారి తలపించిన చోటే
ఎద నిండా నీటిని నింపుతోంది
కరువు తాండవమాడిన చోటే
కడుపు నిండా అన్నం పెడుతోంది!
ప్రతి తల్లి ముఖంలో నవ్వులు
బతుకమ్మలై విరబూస్తున్నాయి
ప్రతి మనిషిలోని వెన్నెముక
నాగలై దర్పంగా నిలబడుతోంది!
నగరాలన్నీ ఆభరణాలై
వెలుగులు విరజిమ్ముతున్నయ్
పల్లెలన్నీ మెతుకుసీమలై
పచ్చని తోరణాలు కడుతున్నయ్!
అల్లాడిపోయిన తెలంగాణ
ఆశయాలతీరం చేరుకుంటోంది
తల్లడిల్లిన తెలంగాణ
తల్లిలా అక్కున చేర్చుకుంటోంది!
వెనుదిరిగే ముచ్చటే లేదు
సాధించుకున్న తెలంగాణను
కల్పవృక్షంలా పెంచుకోవాలె
అడుగడుగున అడ్డుగా వచ్చే
చీడ పురుగులను తుదముట్టించాలె
నకిలీల అసలు రంగును బయటపెట్టి
ఆత్మగౌరవాన్ని రెపరెపలాడించాలి!
– పుట్టి గిరిధర్,94914 93170