తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని ఫజల్ అలీ కమిషన్ ఎందుకు సిఫారసు చేసిందో తెలుసుకునే ముందు ఈ రెండు ప్రాంతాల మధ్య భావసమైక్యత కలగకపోవడానికి గల కారణాలు తెలుసుకోవాలి. నిజానికి ‘ఆరు నెలల్లో వారు వీరౌతారు’ అన్నది సామెత. కానీ, 60 ఏండ్లయినా రెండు ప్రాంతాలవారు కలిసి ఉండలేకపోవడానికి చాలా బలమైన కారణాలు ఉండాలి, ఉన్నాయి కూడా! చాలామందికి తెలియని విషయం ఉత్తర, దక్షిణ భారతదేశంలో కూడా ఈ రెండు భాగాలకు చాలా విషయాల్లో పొంతన లేదు. ఉత్తర భాగం సంస్కృతి, సంస్కారం వేరు, అలాగే దక్షిణ భారత సంస్కృతి, సంస్కారం వేరు. ఇది వారి సంస్కృతి మూలాల్లో దాగి ఉంటుంది.
ఉత్తర భారతదేశంలో ఆర్య సంస్కృతి ప్రబలంగా ఉంటుంది, దక్షిణాది రాష్ర్టాల్లో ద్రవిడ సంస్కృతిని పాటిస్తారు. ఆర్య సంస్కృతిలో దోపిడీతత్వం, పెత్తనం చేసి ఇతరులను అణచివేయడం వంటి లక్షణాలు ఉంటాయి. ఇది వేద కాలం నుంచీ రాలేదు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత వివిధ దేశాల మధ్య బంధాలు తెగిపోయాయి. సుమారు 3 శతాబ్దాల తర్వాత విదేశీ దండయాత్రలు, వారి సంస్కృతి ఇక్కడ విస్తరించడంతో ఉత్తర భారతం దానితో ఎక్కువ ప్రభావితమైంది. కానీ, దక్షిణ భాగానికి కూడా వారే పాలకులైనా, ఇక్కడి ప్రజాజీవితం, ఆచార వ్యవహారాల్లో ఆ విదేశీ పాలకులు ఎక్కువ కల్పించుకోలేదు. కొందరిని మత మార్పిడి మాత్రం చేశారు.
ఇక ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలనే తీసుకుంటే ఆంధ్ర ప్రాంతం మీద బ్రిటిష్ పాలకుల ప్రభావం ఎక్కువ. వారి జీవన విధానం అందితే జుట్టు, అందకపోతే కాళ్లు! స్వార్థం, ఇతరులను తొక్కేయడం, తమ సంస్కృతే గొప్పదన్న భావన వంటివి బ్రిటిష్ వారి దగ్గర నుంచి నరనరాల్లో పట్టిపోయింది ఆంధ్ర ప్రాంత నేతలకు. వారు తమిళులతో కలవలేకపోయిన కారణం కూడా ఇదే! తెలివైన తమిళుల ముందు ఆంధ్ర వారి అతి తెలివి పారలేదు. అందుకే వారి మద్రాసుని గుంజుకోలేకపోయారు.
ఇక తెలంగాణ ప్రాంత సంస్కృతి ద్రవిడ సంస్కృతే. అందరినీ ఆదరించడం, వైవిధ్యాలను గౌరవించడం, అందరికీ సహాయం చేయగలిగిన ప్రేమాస్పదులు ఈ ప్రాంతంవారు. అందుకే దాదాపు 400 ఏండ్ల క్రితం నుంచి భారతదేశ ఇతర రాష్ర్టాలకు చెందినవారు-మలయాళీలు, తమిళులు, కన్నడిగులు, మరాఠీలు, పంజాబీలు, గుజరాతీలు, మర్వాడీవారు, నిజాం సైన్యంలో ఉద్యోగాల కోసం వచ్చిన కశ్మీరీలు, ఉత్తరప్రదేశ్ ప్రాంతంవారు, ఇంకా మధ్యతూర్పు దేశాలైన ఇరాన్, ఇరాక్ నుంచి వచ్చినవారు ఇక్కడ చాలా బాగా స్థిరపడ్డారు. వారు కుటుంబంతో వారి భాషల్లో మాట్లాడుకున్నా, స్థానిక భాషలు నేర్చుకోవడమే కాకుండా, స్థానిక సం స్కృతిలో బాగా కలిసిపోయారు. ఈ తెలంగాణ అప్పుడు మినీ ఇండియాగా భాసిల్లింది. ‘గంగా జమునా తెహజీబ్’ అని గాంధీజీ అన్న ఒక్కమాట చాలు తెలంగాణ సంస్కృతి, సంస్కారం ఎంత గొప్పవో తెలుసుకోవడానికి. మరి ఆంధ్రావారు? గంగాలో ‘జ’ లేదని జమునలో ‘గ’ లేదని పోట్లాడుకోగలిగిన సమర్థులు. ఇతర భాషలవారు తెలంగాణ ప్రాంతంవారితో కలిసిపోవడానికి కారణం స్థానిక సంస్కృతిలో వారు మమేకమవ్వడం. అదే ఒకే భాష అని గొంతులు చించుకుని కూడా స్థానిక సంస్కృతిలో కలవకపోవడంతో నీరు, నూనెలా మిగిలారు.
సంస్కృతి అంటే ఆచార వ్యవహారాలు, పండుగలు, భాష, భావాలు మొదలైనవన్నీ ఉంటాయి. సాధారణంగా ఈ ఆచారాలు, పండుగలు మతానుసారం ఉంటాయి గనుక వివిధ మతాలవారికి మధ్య వైవిధ్యం ఉంటుంది. అయితే తెలంగాణ సంపన్నమైన సంస్కృతిలో ఈ వైవిధ్యాలను, వ్యత్యాసాలను గౌరవించి మనిషిని మానవీయ భావాలతో గుర్తిస్తారు కాబట్టి, ఈ రకరకాల భాషలవారే కాక మతాలవారి మధ్య కూడా ఎటువంటి భేదభావాలు లేకుండా కలిసిపోయారు.
400 ఏండ్లు ఇన్ని రకాల వారు అన్నదమ్ముల లాగ కలిసి ఉంటే, ‘మాది ఒకటే భాష, తెలంగాణ వారికి నిజమైన సోదరులం మేమే’ అని అరుచుకుని కలిసిన ఆంధ్ర వారు ఎందుకు ఈ ప్రజలతో మమేకం కాలేకపోయారు?
1.చరిత్ర: కొద్దిగా చరిత్ర తెలుసుకుందాం. తెలంగాణ ప్రాంతం 14వ శతాబ్ది మధ్య భాగం నుంచి ముస్లిం పాలకుల కింద ఉండింది. అయితే ఈ పాలకులు వాళ్ల అధికారం, సంపద తోటి తృప్తిపడ్డారు కానీ, సామాన్య ప్రజల రోజూవారీ జీవితంలో గాని, సంస్కృతిలో గాని వేలుపెట్టలేదు. మతం మారినవారు వారి మతానుసారం, హిందువులుగా ఉన్నవారు వారి సాంప్రదాయాలు, ఆచారాల ప్రకారం కలిసిమెలిసి సంతోషంగా బతికారు. గొప్ప విషయం ఏమిటంటే జనాభాలో ముస్లింలు 10 శాతం ఉంటే, తెలుగు, కన్నడ, మరాఠీ మాతృభాషలుగా కలిగిన హిందువులు తలో 20 నుంచి 30 శాతం ఉండేవారు. ఇక మిగిలిన పంజాబీ, మార్వాడీ, గుజరాతీ, మలయాళీ, తమిళ భాషలు మాట్లాడేవారంతా కలిపి 10 నుంచి 15 శాతం ఉండేవారు. అయితే వీరు స్థానిక భాషలు నేర్చుకునేవారు. ఇక సామల సదాశివ, పీవీ నరసింహారావు లాంటి విద్వత్తు ఉన్నవారు దాదాపు 15 భాషలు తెలిసినవారే కాక, ఆయా భాషల్లోని గొప్ప సాహిత్యాన్ని స్థానిక భాషల్లోకి అనువాదాలు చేసినవారు కోకొల్లలు.
ఇక ఇక్కడి ఐక్యత భారతదేశంలో బహుశ మూడు మతాలవారు సమమైన నిష్పత్తిలో ఉన్న కేరళలో తప్ప మరెక్కడా కనిపించదు. బయట నుంచి వచ్చిన ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కూడా స్థానిక సంస్కృతి, ప్రజాజీవనంలో భాగమైపోయారు. ఇలా వైవిధ్యభరితమైన అంశాలతో, భావాలతో గౌరవంగా, సామాజిక స్పృహతో బతుకుతున్న తెలంగాణలో ‘ఆంధ్ర సోదరులు’ భాషా ప్రాతిపదికన ప్రవేశించారు. ఇక వారి చరిత్ర పరిశీలిద్దాం!
1600 సంవత్సరంలో వర్తకులుగా ప్రవేశించిన బ్రిటిష్‌వారు మెల్లిమెల్లిగా వివిధ రాజ్యాల్లో తిష్టవేసి అక్కడి రాజులను, ధనవంతులను మచ్చిక చేసుకున్నారు. క్రమంగా స్థానిక రాజులకు కొట్లాటలు పెట్టి, తమ సైన్యాన్ని రప్పించి ఒకరికి సహాయం చేసి చివరికి ఇద్దరినీ లొంగదీసుకుని రాజ్యాలను ఆక్రమించేవారు. 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. 1857లో భారతీయులే బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా యుద్ధం చేశారు. కానీ, రెండింటిలోనూ తమ బలమైన సైన్యంతో సైనికులను అణచివేశారు బ్రిటిష్‌వారు. 1757లో బలపడి, 1857లో పూర్తిగా పాలనను తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి పరాయివారి దోపిడీకి బలైపోయి, కొందరు మాతృభూమి విముక్తి కోసం పోరాడే ధీరులుగా తయారైతే, చాలా మంది తమ బతుకు మాత్రమే చూసుకునే స్వార్థపరులుగా తయారయ్యారు. ఆ పాలన వల్ల జరిగిన నష్టాలు రెండు. అసలే వివిధ భాషలు కలిగిన రాష్ర్టాలు ఉండి, ఐక్యత తక్కువగా ఉన్న ప్రజల్లో బ్రిటిష్‌వారి ‘విభజించి పాలించే’ సిద్ధాంతం భారతీయ సమాజాన్ని ఇంకా ముక్కలు చేసింది. రెండో నష్టం పరాయి పాలనలో నలిగి కష్టాలు ఉండటంతో ఎవరి లాభం వారు చూసుకునే స్వార్థపరులుగా తయారయ్యారు కొందరు భారతీయులు.
క్రిస్టియన్ మిషనరీలు 1600 సంవత్సరం నుంచి భారతదేశంలో ప్రవేశించి మత మార్పిడి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇక బ్రిటిష్‌వారి పాలన బలపడ్డాక వారి మార్పిడులు కూడా ఎక్కువగానే జరిగాయి. ముస్లిం పాలకులు క్రీ.శ.712 నుంచి దండయాత్రలు చేసినా, క్రీ.శ.1326లో మొదటి పానిపట్టు యుద్ధ విజయంతో మొఘలుల పాలన మొదలైనప్పుడే ఆ మతంలోకి మార్పిడులు ఎక్కువయ్యాయి. బ్రిటిష్‌వారు స్థిరపడేసరికి ఆ రెండు మతాలవారు రెండు విభిన్నమైన సమూహాలుగా ఉన్నా, అధిక జనాభా వారు అప్పటిదాకా సనాతనధర్ములుగానే ఉన్నారు. బ్రిటిష్‌వారికి ‘ధర్మం’ అన్నమాట అర్థం కాలేదు. పైగా ఈ సమూహాన్ని కూడా ఏదో ఒక మతం పేరు పేడితే తప్ప వీరికి మిగతావారికి పోట్లాటలు పెట్టడం కుదరదు. అంతకుముందు పర్షియన్, అరబిక్ మాట్లాడేవారు సింధు నదిని హింద్ అని అనేవారు. అది ఒక భౌగోళిక ప్రాంతానికి చెందిన పదమే కానీ, సనాతన సంస్కృత శాస్ర్తాలు, చరిత్ర, రచనల్లో ‘హిందు’ అన్న పదం కనబడదు. బ్రిటిష్‌వారు దాన్ని పట్టుకుని ఒక మతం లాగా మార్చి ఆధ్యాత్మిక, శాస్త్రీయ రచనలైన వేదాల దగ్గర్నుంచి మొదలుపెట్టి సంస్కృత రచనలన్నీ హిందువుల మత గ్రంథాలని ముద్రవేసి, భారతీయ జనాభా అందరికీ హిందువులని నామకరణం చేశారు. అంతకుముందే 1835లో మెకాలే అనే బ్రిటిష్ చరిత్రకారుడి సలహా అనుసరించి భారతదేశంలోని ముఖ్యమైన పట్టణాల్లో పాఠశాలలు, పెద్ద నగరాల్లో కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఇంగ్లిష్ మీడియంలో ప్రారంభించారు. అక్కడ చదువుకున్న భారతీయులతో హిందూ మతం గురించి పుస్తకాలు రచింపజేసి విస్తృత ప్రచారం చేశారు. అంతేకాదు, ఈ హిందువులను కులాలవారీగా పేర్లు పెట్టి విడదీశారు.
ఇది మనకు తెలియడం ఎందుకు అవసరం అంటే, తెలంగాణతో ఆంధ్ర ప్రాంతం కలిసేటప్పటికే ఆ ప్రాంతం వారంతా మతాలుగా, కులాలుగా విడిపోయి పరస్పర ద్వేషం కలిగి ఉండేవారుగా తీర్చిదిద్దబడ్డారు. బ్రిటిష్‌వారు భారతీయులకు, ముఖ్యంగా సనాతన ధర్మానికి చేసిన అతిపెద్ద ద్రోహం ఇది!
ఇక్కడ తెలంగాణలో మత విద్వేషాలు, కులాల కుంపట్లు లేకుండా అందరూ సనాతన ధర్ములుగా బతుకుతున్న వారి మధ్యలో ఈ ఆంధ్ర వారి ప్రవేశం జరిగింది. ఇక్కడి ముస్లిం పాలకులు హిందువులను ఆదరించేవారు. వారితో గౌరవింపబడి, ప్రేమింపబడేవారు. సాహిత్యాన్ని, కవులు, పండితులను పాలకులు ఎంతగా ఆదరించేవారంటే, ఒక పాలకుడు ఇబ్రహీం కుతుబ్ షాని ఈ కవి పండితులు ‘మల్కిభరాముడు’ అన్న బిరుదునిచ్చి సత్కరించారు, గౌరవించారు. అంతేకాదు, కులీ కుతుబ్ షా రాజు భాగమతి అనే హిందూ సుందరిని వివాహం చేసుకుని, ఆమె పేరిట భాగ్యనగరం నిర్మించాడు. ఓ ఊరిలో అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం లేదని తెలిసి కారణం ఏమిటని పండితులను ఒక నిజాం భార్య అడిగిందట. ఆ ఊరి మధ్యలో ఒక పెద్ద హనుమంతుడి విగ్రహం ఉండటం వల్లనే అని చెప్పాడట ఓ పండితుడు. ఆవిడ స్వయంగా అక్కడికి వెళ్లి ఊరి బయట పెద్ద గుడి కట్టించి ఆ విగ్రహాన్ని ఆ గుడిలోకి మార్పించిందట. అలా ఉండేవి పాలకులు, పాలితుల మధ్య సంబంధబాంధవ్యాలు. ఇక్కడే సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిపెరిగిన సరోజినీ అనే అమ్మాయి ముత్యాల గోవిందరాజులు అనే నాయుడు కులస్థుడిని వివాహం చేసుకుంది. ఆవిడే భారత కోకిల సరోజినీ నాయుడు!
ఈ విభిన్న చారిత్రక నేపథ్యాల్లోంచి వచ్చిన రెండు జాతులు తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు. మరి వీరి మధ్య సయోధ్య కుదురుతుందా? మానవుడిని మానవీయంగా చూసే సనాతన ధర్మ తెలంగాణకు, కులాలతో కుళ్లిపోయి, పక్కవాడిని, వేరే కులం వాడిని తొక్కేసి తను పైకి రావాలనుకునే ఆంధ్ర సంస్కారానికి పొత్తెలా కుదురుతుంది?
అమెరికాలోనూ కులాల విద్వేషం పారిస్తున్నవారిని ఎట్లా సంస్కరించగలం? కొన్నాళ్లకు కాలిఫోర్నియా ‘మాదే’ అనగల సత్తా ఉన్న ఆంధ్రు లు, తెలంగాణ మంచితనాన్ని ఎట్లా గుర్తించగలరు? హవాయి చెప్పులేసుకుని వచ్చి వలస పాలకుల అండదండలతో వ్యాపారాలు చేసి, తెలంగాణను దోచి, హవా మహళ్లు కట్టారు. కాళ్లకి చెప్పులు లేకుండా వచ్చినవాళ్లూ హైదరాబాద్, తెలంగాణను కబ్జా చేసి, పైగా ‘మేమే మీకు అన్నీ నేర్పించాం, హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాం’ అని అనకుండా ఇంకేమంటారు? వారి నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం?
ఈ చారిత్రక నేపథ్యం అర్థం చేసుకుంటేనే వారి వ్యక్తిత్వం అర్థం అవుతుంది. పైగా స్థానికులను ‘హైదరాబాద్ మీ జాగీరా?’ అని నిస్సిగ్గుగా ప్రశ్నించగలరు వారు. అప్పుడు మద్రాసు కోసం, ఇప్పుడు హైదరాబాద్ కోసం కుట్రలు! బెంగళూరు వాళ్లు, భువనేశ్వర్ వాళ్లు జాగ్రత్తగా ఉండండి. వాళ్ల అమరావతి సంగతి ఇంద్రుడెరుగు, మీ పట్నం మీద కన్నేస్తే మీకే కష్టం!
– కనకదుర్గ దంటు
89772 43484