ధరణి మీద పంట
దశాబ్దం మురిసినం
మా ఊరి చెరువు
ఎండాకాలమైన
ఏట్లే నీరున్నట్టు
ఎండకుండా
అలుగు దుంకి
చెరువు వాగు సాగేది
చెరువెండిపోయింది
సేనెండిపోయింది
సెలకరిపోయి
గొలుకు గొలుకు అయింది
ఉత్త కళ్లపోతే
ఉడుకు దుమ్ము లేచి
కమ్మరి కొలిమై
కాలుతుంది నేల
రైతన్న మనసు
రగిలిపోతుంది
ఆగమైన రైతు
అరక బందు పెట్టే
పుష్కలమైన నీళ్లేవీ
పుసటిది పంట ఏదీ?
– దేవరపాగ కృష్ణయ్య 99634 49579