75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో ఇప్పటికీ పేదరికంలో మగ్గుతున్న వారెవరైనా ఉన్నారంటే వారు మైనారిటీలుగా ఉన్న ముస్లింలే. కనీస విద్య అందక, ఉపాధి మార్గాలు లేక ఇంకా వారు పేదలుగానే ఉన్నారు. సెక్యులరిజం పేరుతో దేశంలోని రాజకీయ పార్టీలన్నీ మైనారిటీలను వాడుకుంటూ మోసగిస్తూ వచ్చాయి తప్ప ఏ పార్టీ, ఏ ప్రభుత్వమూ ఆదుకొన్నది లేదు. ఆ పార్టీలు ముస్లింలను కేవలం ఓటుబ్యాంకు గానే చూశాయి. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు దాటినా మైనారిటీల బతుకులు మారలేదు.
మన దేశానికి మొదటి విద్యాశాఖ మంత్రి అ యిన మౌలానా అబుల్ కలాం..దేశంలో విద్యావ్యవస్థ అవసరాన్ని గుర్తించి, గుణాత్మక విద్య ఆవశ్యకతను నొక్కి చెప్పారు. కేవలం విద్య ద్వారానే పేదరికం తొలగిపోతుందని బలంగా విశ్వసించిన మౌలా నా, ఆరు నుంచి 14 ఏండ్ల వయసు వరకు పిల్లలకు ఉచి త, నిర్బంధ విద్యను అందించేందుకు కృషిచేశారు. ప్రతి ఒక్కరూ ప్రాథమిక విద్యను పొందడం జన్మహక్కుగా పరిగణించాలని చాటి చెప్పారు. మౌలానా మార్గదర్శకత్వంలో విశ్వవిద్యాలయాల గ్రాంట్ కమిషన్ (యూజీసీ)ని విద్యా మంత్రిత్వశాఖ 1953లో స్థాపించింది. 1951లో అబుల్ నాయకత్వంలోనే మొదటి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్థాపితమైంది. ఇలా ఈరోజు దేశంలో విద్యా ఫలాలు అందరికీ అందుతున్నాయంటే.. మైనారిటీలు కొంత చదువుకోగలిగారంటే ఆయన గొప్పతనమే.
అబుల్ కలాం ఆజాద్ ఆలోచనలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యకు తెలంగాణలో అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వెనకబడిన మైనారిటీల కోసం అనేక విద్య, సామాజిక, ఆర్థికపరమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.. ముస్లింలకు విద్యను అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ 206 మైనారిటీ గురుకులాలు ఏర్పాటు చేసి, ఒక్కో విద్యార్థిపై ఏటా లక్ష రూపాయలకు పైగా ఖర్చుచేస్తూ నాణ్యమైన వసతితో కూడిన విద్యనందిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వం మైనారిటీల అభ్యున్నతికి అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నది. షాదీముబారక్, మైనారిటీ గురుకులాలు, ఒక్కో మైనారిటీ విద్యార్థికి రూ.20 లక్షలకు పైగా ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇస్తున్నది. ఇమాం, మౌజంకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనం, హజ్ యాత్రికులకు ఏర్పాట్లు, పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ, స్వయం ఉపాధికోసం ముస్లిం మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ లాంటి కార్యక్రమాలు వారి ప్రగతికి మైలురాయిగా నిలుస్తున్నాయి. ‘రంజాన్ తోఫా’తో పాటు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తూ లౌకిక స్ఫూర్తిని చాటుతున్నారు. గత తొమ్మిదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం దాదాపు రూ.8,500 కోట్లు ఖర్చు చేసింది. మైనారిటీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి టీఎస్ ప్రైమ్‌ను తీసుకొచ్చింది. వారికి రాయితీలిస్తూ, ప్రోత్సాహకాలు కల్పిస్తున్నది.
మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కోసం అందించే రుణాల సబ్సిడీని 50 శాతం నుంచి 80 శాతానికి పెంచి ంది. విద్య, ఉపాధి, శిక్షణ లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో షాదీఖానా కమ్ ఉర్దూ ఘర్లను ప్రభుత్వం నిర్మించింది. హైదరాబాద్ జామియా నిజామియా యూనివర్సిటీ అభివృద్ధికి ఏటా నిధులు కేటాయిస్తున్నది. రాష్ర్టానికి ప్రత్యేకంగా వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేసింది. మైనారిటీ వర్గాల సామాజిక, ఆర్థిక జీవన స్థితిగతులపై అధ్యయనం చేసి, వారి అభివృద్ధికి సిఫారసులు చేసేందుకు మైనారిటీ కమిషన్‌ను నియమించింది. మైనారిటీల ఆర్థిక పరిస్థితిని గమనించిన సీఎం కేసీఆర్.. వారికి బీసీ కులవృత్తులను ఆదుకున్నట్టే.. మైనారిటీ బంధు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ నిర్ణయంతో లక్షలాది మంది మైనారిటీలకు ఎంతో ఉపశమనం లభించింది. కులమతాలకతీతంగా పేదరికాన్ని తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దార్శనికతతో పనిచేస్తున్నదనడానికి ఇదే నిదర్శనం.
తెలంగాణలో తెలంగాణ ప్రాంత సంస్కృతులను, విభిన్న మత, ఆచార సంప్రదాయాలను సమానంగా ఆదరిస్తూ రాష్ట్రంలో గంగా జమునా తెహజీబ్‌ను కాపాడేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు… అర్హులైన క్రిస్టియన్లకు క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా, అర్హులైన ముస్లిం, సిక్కు, బుద్దిస్ట్, జైన్, పార్శీ మతాలకు, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లక్ష రూపాయల సబ్సిడీని ప్రభుత్వం అందిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మైనారిటీల విద్యా వికాసానికి, వారి సామాజిక, ఆర్థిక ప్రగతికి దోహదం చేసే అనేక పథకాలు, కార్యక్రమాలను చేపట్టి సంఘంలో ఆత్మ గౌరవం, హోదా కలిగిన పౌరులుగా తీర్చిదిద్దే కార్యాచరణను ప్రభు త్వం అమలు చేస్తున్నది. సర్వధర్మ సమభావనను పాటిస్తూ, ఏ సామాజిక వర్గం పట్ల వివక్ష, విస్మరణ లేకుం డా ప్రగతి ఫలాలను అందరికీ అందజేస్తున్న సీఎం కేసీఆర్ వైపే అన్ని వర్గాల ప్రజ లు ఉన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమాన్ని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఎన్నో పథకాలను అమలు జేస్తున్నారు సీఎం కేసీఆర్..సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న విషయంలో తెలంగాణ దేశంలోనే మొద టి స్థానంలో ఉన్నది. అందుకే మరోసారి కేసీఆర్ పాలన కావాలని తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజ యం సాధించడంలో ముస్లింల భాగస్వామ్యం కచ్చితంగా ఉంటుం ది. తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రం గా కేసీఆర్ పాలనలో మరింత ప్రగతి పథంలో ముందుకుసాగాలని కోరుకుందాం.
– సయ్యద్ నాజీం అహ్మద్ 98484 80890