ఏ ఊకో నీతోనేమైతది.. ఒకడి పరాష్కం..
చీకటి తప్ప ఎల్తురు కానవు.. ఇంకొకడి శాపనార్థం..
ఒక్కడై నిలబడి.. కోట్ల కాంక్షను నెరవేర్చి
నవ్విన నాపచేను పండేలా జేసిండు..!
ఏడేండ్ల కిందటి దాకా పడావుబడ్డ ఊరు
ఎండిన నేల తప్ప తడారని పైరు చూడని ఊరు
ఇప్పుడెట్లుందో.. జర నిజం జెప్పు?!
ఆ ఊరికి.. నీళ్లు ఇల్లు వెలుగు కొలువు
ఇప్పుడా ఊరికి జాతరొచ్చింది
యువ కొలువుల జాతర
జల్ది నడు ఓ అన్నా..
పోదాం పద ఓ అక్కా..
ఎట్లన్న ఈపారి కొలువును కొట్టాలె
ఉడుం పట్టు పట్టాలె..
ఎగిర్త వడితే ఏమైతది
నిమ్మలంగా యోచన జెయ్యాలే
మతం మత్తుల ముంచితీసేటోళ్ల
గతం తప్ప ముంగటికి నడవనియ్యనోళ్ళ
బట్టేబాజ్ మాటల్ని బేఖాతరు జెయ్యాలే
ఒక్కడున్నడు..
నీ, నా, మన కలలను
చెదిరిపోకుండా రక్షించేటోడు
అదిగో… అతడి చేతుల్లో
నా భవిష్యత్ తెలంగాణ భద్రంగున్నది!
– జాబేర్ పాషా
(మస్కట్, ఒమన్ నుంచి..)