జయ జయ జయ తెలంగాణ కేతనమెగరేయరా
నవదీప్తుల తెలంగాణ కీర్తిని నినదించారా
వేల వేల త్యాగాలతో వెలసినదీ నేలరా
వీర రక్తధారలతో తడిసిన మొగసాలరా..
//జయ జయ//
చరణం:1: గతమెన్నడు జరగని ఘన విజయాలను సాధించె
అనితరులకు సాధ్యమవని అద్భుత పథకాలతో :2:
కమతాలకు వరదాయిని కాకతీయ మిషను వచ్చి
వేల వేల సాగుబడుల దిగుమతులను పెంచె :2:
రైతన్నకు నేతన్నకు నేనున్నా తోడంటూ
కర్షకులకు కార్మికులకు జీవనభృతి కల్పించె
ఆడపడుచులందరికీ చీర సారెలర్పించి
బహువిధ పథకాలెన్నో బహుకరించె సర్కారు
పల్లెలు ప్రతి పట్టణాలు ప్రకృతి ప్రతిరూపంగా
హరితహార శోభలతో నందనాన్ని తలపించగ
కల్వకుంట చంద్రునికే వందనాలు వినిపించె:
//జయ జయ//
చరణం 2: ఇంటింటికి తాగునీరు తెచ్చెను భాగీరథి
ప్రతి ఇంటికి ప్రయోజనం అందించిన జనవారధి :2:
విజ్ఞానం పెంపుదలకు విదేశాల పెట్టుబడులు
నిరుద్యోగ సమస్యలకు నివారణ మంత్రం :2:
భిన్న భిన్న వర్గాలకు బహు ముఖ పథకాలెన్నో
బంగారు తెలంగాణ భారతానికాదర్శం
నిస్వార్థపు త్యాగానికి నిలువెత్తు సాక్షి
విద్వత్తును విద్యుత్తుగ
వినిమయయించె కేటీఆర్
బహుముఖ ప్రజ్ఞతో
భవితవ్యం తీర్చిదిద్దె
రాజకీయ యవనికపై
రారాజే కేసీఆర్
ఉద్యమ నేపథ్యానికి
దార్శనికము తెలంగాణ
//జయ జయ//
– మహతి తేజశ్రీ