సీ.: ఆశ్రితదీనజనార్తిని తీర్చగ
కామధేనువు తెలంగాణభూమి
పాడిపంటలు పొంగి పరిఢవిల్లగ దివ్య
కల్పవృక్షము తెలంగాణభూమి
నేల నల్మూలల నీరునందించు స్వ
ర్గంగానదము తెలంగాణభూమి
అభివృద్ధి సంక్షేమ శుభనందనోద్యాన
గంధసారము తెలంగాణభూమి
తే.గీ.: సకల సిరులకాణాచి ఆ స్వర్గసీమ
ఇలకు దిగివచ్చెనోయన నిలిచినావు
అష్టవర్షాల నా చిట్టి అమ్మ నీకు
ఇష్టపూర్వక ప్రణతులర్పింతు కొనుము
– డాక్టర్ అయాచితం శ్రీధర్
98498 93238