అరవై ఏండ్లు పోరాడి సాధించుకున్న
తెలంగాణలో భవిష్యత్తు
ఇప్పుడిప్పుడే మారుతున్నది…
ఎండిపోయి నోళ్లు తెరుచుకున్న
బీడు భూములకు
నీళ్లొచ్చి దూప తీరుతున్నది
అరిగోస పడ్డ రైతు జీవితాలు
పసిడి పంటలతో
జర ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్నయి..
చితికిపోయి చిద్రమైన
నిరుద్యోగులకు ఉద్యోగాలు
ఉద్యోగులకు ప్రమోషన్లు
ఇప్పుడిప్పుడే సురు వైనయ్….
కాలొంకర వొల్లొంకరతో దిగాలు పడ్డ
ప్రజల బతుకులకు కారణభూతమైన
ఫ్లోరోసిస్ భూతం పాతాళానికి తొక్క బడింది ..
తెలంగాణ వచ్చినంక
బతుకమ్మ బోనాలు ఆత్మగౌరవంతో
ఆడుకుంటున్నం..
మన నీళ్లు మన నిధులు
దారి మళ్లకుండా వనరుల
దోపిడి జరగకుండా
అరికట్ట గలుగుతున్నం…
అన్నింటికి మించి
కడుపు కోతల కన్నీటి గాథలు
ఆకలి మంటలు అవమానాలు
తప్పించుకుంటున్నం….
ఎన్నో ఏండ్ల కల ఫలించిన ఈ వేళ
కోటి దేవుళ్ళకు మొక్కితీరుతున్నం
తొందరపడి మనకు మనం
దుంకులాడి పెనుగులాడి
ఎదుటోని ముందు అభాసుపాలు కావొద్దు
అమరుల త్యాగాల పునాదుల పైన
సాధించుకున్న తెలంగాణను
నిలబెట్టుకుందాం
సబ్బండ జాతుల భవిష్యత్తును
బంగారు తెలంగాణలో తీర్చిదిద్దుకుందాం..
– కోమటి రెడ్డి బుచ్చిరెడ్డి
94415 61655