దాశరథి అవార్డు అందుకున్న సందర్భంగా..
రచయితగా, వ్యాసకర్తగా పలు పత్రికలకు కాలమిస్ట్‌గా నిరంతరం తెలంగాణ జీవద్భాషను ఆవిష్కరిస్తున్న కవి అన్నవరం దేవేందర్. ‘సోమన, పోతనల దేశీయతను, సహజత్వాన్ని వారసత్వంగా పల్లె పదాలకు జీవం పోస్తున్న దేశీయ కవి అన్నవరం. విప్లవ కవిగా మొదలైన ఆయన ప్రస్థానం తర్వాతి కాలంలో దళిత, బహుజన, తెలంగాణ ఉద్యమ అస్తిత్వ వాదం వైపు మళ్లింది.
‘చేతి పనుల ఇరుసులు విరిగిన ధ్వని
నాలుగు ముక్కలైన నాగలి కర్రు
దేశీయత దేహం గాయమైంది’
ప్రపంచీకరణ ప్రభావంతో కళతప్పిన గ్రామాలను చూసి కవి గుండె గాయపడింది!
‘వాకిలి గీతం’ కవిత పల్లె కళాత్మక జీవన సౌం దర్య శాస్త్రం అంటే బాగుంటుందేమో. గోరటి వెంకన్న ‘సంత’ ఎంతటి మాధుర్యాన్ని, ఆత్మీయతను పంచుతుందో అన్నవరం దేవేందర్ ‘వాకిలి గీతం’ కూడా అంతే మాధుర్యాన్ని పంచుతుంది. ఎంత చదివినా తనివి తీరది. అంత కమ్మగుంటది ఈ కవిత.
‘ఇంటి సూరుకు బుట్ట
గోడ వారగా ఒరిగిచ్చిన తోపెల
ఎండబోసిన పచ్చి శాపలు
వాకిలంతా కమ్మకమ్మని నీసు
అది బెస్తోల్ల ఇల్లు జలపుష్పాల జల్లు’
అంటడు. నీసు వాసనను అమాం తం కౌగిలించుకునే గొప్ప హృద యం కవిది. ఇట్లా పల్లెలో ప్రతి ఇల్లు శ్రమజీవుల శింగారం అం టాడు కవి దేవేందర్.
‘మా ఓట్లకు పుట్టిన బాపులు
జర చెప్పుండ్రి అయ్యలాల
అడుగుల్లేని కడుముంతలు
నీళ్లు ముల్లెగట్టినట్లు మాట్లాడకుండ్రి’
అంటూ సామాజిక బాధ్యత గల కవిగా కుటి ల రాజకీయాలను ప్రశ్నిస్తాడు. ఆ దృక్పథంతోనే ‘ప్రజా బాహుళ్య ప్రయోజనమే నా కలంలో సిరాగా చేరింది’ అన్న కవితా పంక్తులు దర్శిస్తా యి. సమాజంలో ఆయా కాలాల్లో సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, చారిత్రక సంఘటనలకు, భావోద్వేగాలకు, మార్పులకు ప్రతిబింబించే సామాజిక చైతన్యం, బాధ్యత అన్నవరం కవిత్వంలో పుష్కలంగా కనిపిస్తుంది. దీనికి ‘మంకమ్మతోట లేబర్ అడ్డా’ కవితనే సాక్ష్యం.
‘బువ్వకుండా’, ‘బుడ్డ పర్కలు’, ‘వరి గొలు సు’, ‘గవాయి’, ‘బొడ్డు మల్లె చెట్టు’, ‘పొద్దు పొడుపు’. ‘పొక్కిలి వాకిళ్ళ పులకరింత’ మొదలైనవన్నీ పల్లెను పెనవేసుకున్న పదాలు. ఆ పదాలకు జీవం పోసి తన సహజత్వాన్ని చాటిచెప్పా రు. ఇవే ఆయన 12 కవితా సంపుటాల్లోని కవి తా శీర్షికలు కూడా. ఇవి ఉద్దేశ్యపూర్వకంగా, ఎవరి మెప్పు కోసమో రాసినవి కావు. ఆయనలోని తెలంగాణ భాష మాధుర్యాని కి, ఒక ధారగా వస్తున్న తెలంగాణ భాషా ఔన్నత్యానికి ప్రతీకలు మాత్రమే. ఇదే ఆయన ప్రత్యేకత. కాబట్టే పలు వర్సిటీల్లో ఆయన రచనలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇతర భాషల్లోకి అనువాదం చేయబడుతున్నాయి. ఇగ పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగిగా ఉండి కూడా నాడు తెలంగాణ ఉద్యమంలో కలం ఎత్తి ధిక్కారస్వరం వినిపించారు. ‘తొవ్వ’, ‘నడక’, ‘వల్లుబండ’ ఉద్యమ కవిత్వానికి ఊపిరిపోశాయి.
వివిధ పత్రికలకు కాలమిస్ట్‌గా ఆయన వ్యాసాంగం, సామాజిక తత్వశాస్త్ర దృష్టికోణాన్ని వ్యక్తం చేస్తాయి. ‘మరో కోణం’ పేరుతో సామాజిక వ్యాసాలు, ‘ఊరి దస్తూరి’ పేరుతో తెలంగా ణ సాంస్కృతిక జీవన చిత్రణ, ‘అంతరంగం’ పేరుతో వర్తమాన జీవన చిత్రణ, ‘సంచారం’ యాత్రా వ్యాసాలు, ‘ఎన్నీల ఎలుగు’ ఆధునిక జీవనశైలి వాస్తవికతలు, తెలంగాణ ఊరి సామెతలు, మానవ సంబంధాలు, సామాజిక, కు టుంబ, వ్యక్తిగత జీవన విధా నం మొదలైన అ నేక అంశాలను లోతై న విశ్లేషణతో రాసిన సామాజిక వ్యాసాలు బహుళ ప్రాచుర్యంలోకి వచ్చా యి. అనివార్య కారణాల వల్ల కాలమిస్ట్ వ్యా సాలు ఆగిపోతే ఆయా పత్రికలకు పాఠకులు తగ్గిపోవడం విశేషం.