తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్నికల గురించే చర్చ నడుస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల లాభపడ్డ ప్రజలే రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు. ఏదో ఒకరకంగా ప్రతి కుటుంబానికి బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకం అందిందనేది వాస్తవం.
ఇట్లా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలు తమ ఓటు ఈసారి కూడా బీఆర్ఎస్కు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉండాలన్నదే వారి సంకల్పం అని స్పష్టంగా కనిపిస్తున్నది.
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్నది. ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమవుతుండటంతో అవినీతికి ఆస్కారం లేదు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నది కాదన లేని సత్యం. రైతుబీమా లాంటి పథకం రైతు కుటుంబాలను ఆదుకోవడంలో ముందు వరుసలో ఉన్నది.
తాము అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్‌ను ఐదు వందలకే అందిస్తా మంటు న్నది కాంగ్రెస్. అయితే ప్రస్తుతం తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఈ స్కీం ను ఎందు కు అమలు చేయడంలేదో వారు చెప్పడం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత రాష్ట్రంలో త్రాగునీరుకు లోటు లేదు. మిషన్ భగీరథ నీరు గంగ పొంగినట్టు ఇంటి ముంగిళ్లలో పొంగుతున్నది. ఒకప్పుడు చెరువుల్లో నీరుండేది కాదు, ఇప్పుడు చిన్న చిన్న కుంటలు కూడా నీళ్లతో, చేపలతో కళకళలాడుతున్నయి. గ్రామాల్లో వ్యవసాయం పెరిగింది. అర ఎకరం ఉన్న రైతు కూడా ఇవ్వాల ఖాళీగా లేడు. రైతు బంధుతో అందరికీ సాయం అందుతున్నది. చేతి వృత్తులు తమ పునర్వైభవాన్ని పొందినై. గురుకులాలు, మాడల్ స్కూల్స్, ప్రభుత్వ స్కూల్స్‌లో పిల్లలు ఉచితంగా నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నారు. అనేక రకాలుగా యువతీయువకులు ఉపాధి పొందుతున్నారు. ఆసరా పింఛన్ పొందిన ప్రతి తల్లి నా బిడ్డ కేసీఆర్ అంటున్నది. సంక్షేమ హాస్టల్స్‌లోని విద్యార్థులు స్వరాష్ట్రంలో సన్నబియ్యం తింటున్నరు. స్కూల్ యూనిఫాం, పుస్తకాలు చివరికి కాపీలు కూడా ప్రభుత్వమే ఉచితంగా అందిస్తున్నది.
సాంకేతిక విద్యను అందించడంలో తెలంగాణ టాప్‌లో ఉన్నది. తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం పెరిగింది. స్వరాష్ట్రం ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటుతో వెలిగిపోతున్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలున్నయి.
అనేక స్కాంలతో, స్కీంలతో ప్రజలను ముంచి, రాష్ర్టాలను అప్పులపాలు చేసి గ్రూపుల కొట్లాటలతో కుర్చీల కోసం తన్నులాటలతో ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేయడం కాంగ్రెస్ నైజం.
కానీ, కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండె ల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్నరు. అది తెలం గాణను అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలబెట్టడం వల్లనే వచ్చింది తప్ప ఇంక దేనివల్ల కాదు. ఎప్పుడైనా ప్రజలకు చేసిన మంచి రాష్ర్టానికి చేసిన అభివృద్ధి మాత్రమే నాయకులను గెలిపిస్తాయని, పార్టీలను అధికారంలోకి తీసుకొస్తాయి. అసత్య ప్రచా రాలు, విమర్శల వల్ల ఒకటి రెండు సీట్లు గెల వొచ్చు కానీ అధికారాన్ని మాత్రం అందించ లేదు. ఈ సత్యాన్ని కాంగ్రెస్ తెలుసు కోవాలని ప్రజలు సూచిస్తున్నారు.
-జి. రాజేష్ నాయక్
96035 79115