కరోనా కష్టకాలంలో మినహా, బీఆర్ఎస్ ప్రభుత్వం 8 ఏండ్ల పాలనలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని ప్రముఖ ఆర్థికవేత్త సౌరభ్ ముఖర్జియా అన్నారు. అది అక్షర సత్యమని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) నివేదిక స్పష్టం చేసింది. ఆర్బీఐ నివేదిక ప్రకారం తెలంగాణలో 2015లో 78,18 లక్షల ఎకరాలకు సాగునీరందితే, కేసీఆర్ పాలనలో 2023 నాటికి 1.6 కోట్ల ఎకరాల్లో సాగునీరు పారింది. 100 శాతానికి పైగా సాగునీటి వనరులు పెరిగాయి. 2015లో 91లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా 2023 నాటికి 2 కోట్ల టన్నులకు అంటే 119 శాతం ధాన్యం ఉత్పత్తి పెరిగింది. 2015లో 9,471 మెగావాట్లు విద్యుత్తు ఉత్పత్తి కాగా, 2023నాటికి ఏకంగా 106 శాతం పెరిగి 19,500 మెగావాట్లకు చేరుకుంది.
2014లో 5 లక్షల టన్నులుగా ఉన్న తెలంగాణ మాంసం ఉత్పత్తులు 2023 నాటికి వందశాతం పెరిగి 10 లక్షల టన్నులకు చేరుకున్నాయి. 2015లో రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం 80,400 హెక్టార్లు కాగా 2023 నాటికి 2,94,800 (266 శాతం) హెక్టార్లకు విస్తరించింది. 2015 నాటికి 92,215 కిలోమీటర్లుగా ఉన్న తెలంగాణ రోడ్లు 2023 నాటికి 1,40,555 కిలోమీటర్లకు పెరిగాయి. 2015 నాటికి వైద్యరంగానికి కేటాయించిన నిధుల కన్నా కేసీఆర్ ప్రభుత్వం 175 శాతం అదనంగా ఖర్చుచేసింది. శిశుమరణాలను 66.6 శాతానికి తగ్గించింది. 2015లో తెలంగాణ తలసరి ఆదాయం రూ. 1,03,889 కాగా, 2023 నాటికి అది రూ. 3,56,564 (243 శాతం)కి పెరిగింది. 2015లో తెలంగాణ ‘జీఎస్డీపీ’ రూ. 4.3 లక్షల కోట్లు. 2023 నాటికి ఇది రూ. 15.1 లక్షల కోట్లకు పెరిగింది. అంటే 249 శాతం వృద్ధి చెందింది. ఇలా అన్ని రంగాల్లోనూ సగటున 100 శాతం వృద్ధిరేటును సాధించింది. ఇదెలా సాధ్యమైందంటూ కేసీఆర్ వైపు దేశం ఆశ్చర్యంగా చూసింది.
అపార రాజకీయ అనుభవం, ఆర్థిక పరిజ్ఞానం కలిగిన కేసీఆర్ తెలంగాణ వ్యవసాయరంగ సర్వతోము ఖాభివృద్ధికి ప్రణాళికలు రచించి, అమలు పరిచారు. బడ్జెట్లో ఆ రంగానికి అత్యధిక నిధులు కేటాయించా రు. కేసీఆర్ అనగానే కాలువలు, చెరువు, రిజర్వాయర్లు అని గుర్తొంచేంతగా తనదైన ముద్రవేశా రు. సాగునీటి వనరులను 100 శాతం పెంపొందించుకున్న దేశంలో ని ఏకైక రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. ‘నీతి ఆయోగ్’ కూడా దీనిని ప్రశంసించింది.
అలాగే, రాష్ట్రంలో ధ్వంసమైన అడవులను కేసీఆర్ పునరుద్ధరించారు. వ్యవసాయానికి నిరంతర విద్యు త్తు, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీతో రైతులను ఆదుకున్నారు. తద్వారా వ్యవసాయం పరుగులు పెట్టింది. ఉచితంగా చేప పిల్లల పంపిణీ, కోళ్ల ఫారాలకు సబ్సిడీపై విద్యుత్తు వంటి వాటితో ఆయా రంగాల సర్వతో ముఖాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. ఫలితంగా, దేశంలోనే అత్యధిక వరిని పండిస్తున్న, మాంసం ఎగుమతి చేస్తున్న, ఎక్కువ ఆదాయాన్ని గడిస్తున్న, వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు అందిస్తున్న, అత్యధిక విద్యుత్తును వినియోగిస్తున్న రాష్ట్రం గా తెలంగాణ ఎదిగింది. గత ఏడు దశాబ్దాల పాలనలో ఆకలితో అలమటిస్తూ, చీకటిలో ఉన్న రాష్ర్టాన్ని దశాబ్దకాలంలోనే అన్నపూర్ణగా, వెలుగుల రాష్ట్రంగా కేసీఆర్ వికసింపజేశారు.
సులభతర వాణిజ్య విధానం ద్వారా దేశవిదేశాల్లోని పారిశ్రామికవేత్తలను కేసీఆర్ ప్రభుత్వం ఆకర్షించింది. గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ వంటి దిగ్గజాలతో సహా 90 శాతం బడా కార్పొరేట్ సంస్థలు లక్షల కోట్ల పెట్టుబడులతో రెక్కలు కట్టుకొని వచ్చి తెలంగాణలో వాలాయి. లక్షలమందికి ఉపాధి కల్పించాయి. గతంలో రూ.70 వేలకోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు కేసీఆర్ హయాంలో రూ.1.75 లక్షల కోట్లకు చేరుకున్నాయి. కార్పొరేట్ దవాఖానల గుత్తాధిపత్యం కొనసాగకుండా, వాటికి దీటుగా ప్రభుత్వ వైద్యరంగాన్ని మెరుగుపరిచారు. ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యారంగాన్ని మెరుగుపరిచారు. అలాగే, కేసీఆర్ పాలనలో మతపరమైన చిన్న ఘటన కూడా జరగలేదు. గురుకులాలు, మెడికల్ కాలేజీలు, అపూర్వ ‘ఎడ్యుకేషనల్ హబ్’ నిర్మాణాల ద్వారా మానవ వనరుల ఉత్పతిని గణనీయంగా పెంచారు కేసీఆర్.
ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా దేశ రాజధాని ఢిల్లీ మోదీ హయాంలో చెత్త రికార్డును మూటగట్టుకోగా, కేసీఆర్ హయాంలో హైదరాబాద్ క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా వర్ధిల్లింది. ప్రణాళికాబద్ధంగా పరిశ్రమించే రాజనీతిజ్ఞుల వల్లనే ఇలా తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి సాధ్యమైందని చెప్పవచ్చు.
వర్తమాన భారత పాలక వర్గాలను పరిశీలిస్తే, జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతల్లో కేసీఆర్ వంటి అధ్యయన శీలురుగాని, రాష్ర్టానికి సరైన రాజకీయ ఆర్థిక విధానాన్ని ఎంచుకోగల్గిన రాజనీతిజ్ఞుడు గానీ లేరన్నది స్పష్టం! ఈ వాస్తవాన్ని గుర్తించి నందువల్లనే ఆమధ్య ‘దేశ్ కీ నేతా కేసీఆర్’ అంటూ రైతులు ఆత్మీయంగా స్వాగతించారు. బీఆర్ఎస్పైనా, కేసీఆర్ పైనా బీజేపీ, కాంగ్రెస్ పగ పెంచుకోవడానికి కారణం ఇదే.
వ్యవసాయానికి నిరంతర విద్యు త్తు, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీతో రైతులను కేసీఆర్ ఆదుకున్నారు. తద్వారా వ్యవసాయం పరుగులు పెట్టింది. ఉచితంగా చేప పిల్లల పంపణీ, కోళ్ల ఫారాలకు సబ్సిడీపై విద్యుత్తు వంటి వాటితో ఆయా రంగాల సర్వతో ముఖాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు.
-పాతూరి వెంకటేశ్వరరావు ,98490 81889