కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ డీఎస్ కొంతకాలంగా అనారోగ్యంగా ఉండటంతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిళ పరామర్శించడానికి వెళ్లింది. ఆ సందర్భంగా ఎప్పటికైనా ముఖ్యమంత్రివి అవుతావని షర్మిళను ఉద్దేశించి డీఎస్ వ్యాఖ్యానించినట్టు ఆ పార్టీ మీడియాకు తెలిపింది. తెలంగాణ రాష్ట్రం కోసం కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఒప్పించడంలో కీలకపాత్ర పోషించిన డీఎస్ అలా ఎలా అన్నారని కాంగ్రెస్ నేతలు ఆశ్చర్యానికి గురయ్యారు.
ఆ మరునాడు కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి, సుదర్శన్‌రెడ్డి డీఎస్ ఇంటికివెళ్లి పరామర్శించి వచ్చారు. ఈ విషయం తెలిసి షర్మిళ సీఎం కావడం ఏమిటీ? డీఎస్ అలా ఎందుకన్నారు? ఆయన మానసికస్థితి బాగానే ఉందా? అని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు పరామర్శకు వెళ్లిన నాయకుడికి ఫోన్‌చేసి అడిగితే, అందుకే కదా తాము వెళ్లి చూసి వచ్చిందంటూ ముక్తసరిగా సమాధానం ఇచ్చి ఫోన్ పెట్టారని తెలిసింది.