e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News యువాన్‌..సేవలో మహాన్‌

యువాన్‌..సేవలో మహాన్‌

భారతావనిలో యువత ప్రాధాన్యతను చాటిచెప్పిన మహనీయుల్లో స్వామి వివేకానంద ఆద్యులు. యువ శక్తితోనే దేశ కీర్తి ప్రతిష్ఠలు నిలుస్తాయని, అభివృద్ధి సాధ్యమవుతుందని వివేకానంద ఉద్బోధించారు. ఆయన కన్నుమూసి 120 ఏండ్లయినా.. ఆ స్ఫూర్తిని కొనసాగిస్తున్న యువత నేటి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నది. శక్తిలోనే కాదు, సేవలోనూ మహాన్‌ అని చాటుతున్నది.

అది నవంబర్‌ మూడోవారం. అర్ధరాత్రి దాదాపు ఒంటిగంట అవుతున్నది. చలి వణికిస్తున్నది. హైదరాబాద్‌ ఉప్పల్‌ చౌరస్తాలోని డివైడర్‌పై చిరిగిన దుస్తులు వేసుకున్న ఓ వృద్ధుడు చలికి వణికిపోతున్నాడు. అంతలోనే అటుగా వేగంగా వెళ్తున్న ఓ వ్యాన్‌ రోడ్డు పక్కన ఆగింది. అందులో నుంచి పరుగున వచ్చిన ఓ యువకుడు.. చేతిలోని దుప్పటిని తీసి చలికి వణుకుతున్న వృద్ధుడికి కప్పాడు. మాట మాట్లాడకుండానే మళ్లీ వ్యాన్‌వైపు పరిగెత్తి బండెక్కి వెళ్లిపోయాడు!

- Advertisement -

కరోనా లాక్‌డౌన్‌ సమయం. హైదరాబాద్‌లోని నాగోల్‌. మిట్ట మధ్యాహ్నం. యాక్టివాపై ముందర రెండు సంచులు పెట్టుకుని ఇద్దరు యువతులు దూసుకొచ్చా రు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న కూలీల దగ్గర ఆపా రు. సంచుల్లోంచి అన్నం (మీల్స్‌), నీళ్ల ప్యాకెట్లను తీసి వారి చేతిలో పెట్టారు. ఊరూ, పేరూ చెప్పకుండానే మళ్లీ వచ్చిన తోవలో ఆ యువతులు వెళ్లిపోయారు.

అది ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌. అర్ధరాత్రి. వేగంగా వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. కారులో ఓ వ్యక్తి ఇరుక్కుపోయాడు. అటుగా వెళ్తున్న రెండు బైక్‌లపై ఉన్న నలుగురు యువకులు ఆగారు. పోలీసులు, 108కు సమాచారం ఇచ్చారు. వాళ్లొచ్చేలోపు.. కారులో ఇరుక్కున్న వ్యక్తిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. సొంత కుటుంబసభ్యులైతే ఎంత తపన పడతారో.. అంతలా అల్లాడిపోయారు. పోలీసులు రావడం.. అంబులెన్సులో క్షతగాత్రుడిని తరలించగానే.. ఆ యువకులు అక్కడి నుంచి అనామకుల్లా వెళ్లిపోయారు.

ఇదీ.. మన యువత సత్తా. ‘ఆపదలో ఉన్నాం.. ఆదుకోండి’ అని అడగాల్సిన అవసరంలేదు. అవసరమైన ప్రతిచోటా మేమున్నాం అంటూ ముందుకొస్తున్నారు. చేతులు కలిపి సేవలో పాల్గొంటున్నారు. పలానా గ్రూపు రక్తం అవసరం ఉన్నదని సోషల్‌మీడియాలో ఒక పోస్టు పెడితే చాలు.. పరుగున వచ్చి ‘రక్త’సంబంధీకుల్లా అండగా నిలుస్తున్నారు.

దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన ‘ఎన్‌లైటింగ్‌ ల్యాంప్స్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌’ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాల్లో మచ్చుకు కొన్ని ఇవి. ఏది చేసినా ఇతరులకు ఉపయోగ పడాలని ‘దోస్తుల పుట్టిన రోజు వేడుకలను కూడా అనాథాశ్రమాల్లో జరుపుకొంటున్నాం’ అని మల్కాజిగిరికి చెందిన ‘హెల్పింగ్‌ హ్యాండ్స్‌ సేవా సంస్థ’ ప్రతినిధులు అంటున్నారు. రోజూ కాలేజీకి వెళ్తూ వారాంతం, ప్రత్యేక రోజుల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలా మానవతను చాటుతూ యువత ముందుకు రావ టం ఆహ్వానించదగిన పరిణామం. అందుకే ‘యువాన్‌.. సేవలో మహాన్‌’ అనేది ఎవరూ కాదనలేని వాస్తవం.

కుకుట్లపల్లి రాకేశ్‌, 80083 33776
(నేడు స్వామి వివేకానంద జయంతి, యువజన దినోత్సవం సందర్భంగా..)

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement