తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ద్దీ కాంగ్రెస్ నాయకులు ప్రజలను రెచ్చగొట్టే రీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించటం తీవ్ర అభ్యంతరకరం. ఆయా పార్టీల నాయకులు వారి స్థాయిని మించి వ్యక్తిగత ధూషణలకు దిగుతున్నారు. మేం అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దుచేస్తామని ఒకరు, రైతుబంధు నిలిపివేస్తామని మరొ కరు, ప్రాజెక్టులు అవసరం లేవని ఒకరు, జైలుకు పంపిస్తామని ఒకరు విద్వేష ప్రచారాలు చేస్తున్నారు. వారి ప్రచారశైలి చూస్తే ప్రచారం ఏ స్థాయికి దిగజారిందో అర్థం అవుతున్నది.
‘బక్క’మనిషిని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ కూటమి కడుతున్నాయి. 2జీ స్కాం, నేషనల్ హెరాల్డ్, కోల్ స్కాం, బోఫోర్స్ లాంటి అవినీతి కేసుల్లో పీకలదాక కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అవినీతిని అంతం చేస్తాం, అవినీతిపరులను శిక్షిస్తామంటూ పరుష పదజాలంతో కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శించటం విడ్డూరంగా ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు తెచ్చుకోవడానికి ప్రజలను రెచ్చగొట్టే వ్యూహాన్ని కాంగ్రె స్ బుద్ధిపూర్వకంగా ఎంచుకున్నట్టు కన్పిస్తున్నది. ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్సే, రేవంత్ సీఎం అంటూ, కాదు నేనంటూ కోమటిరెడ్డి, లేదు దళితుడే ముఖ్యమంత్రి అంటూ భట్టి కాకిలెక్కలు వేసుకొని కాలం వెళ్ల్లదీస్తున్నారు. డిసెంబర్ 9న బీఆర్ఎస్ను గద్దె దించడం ఖా యమంటూ, ముహూర్తం పెట్టుకున్నారంటే, ‘ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు గోవిందం’ అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ నేతల కథాకళి. ఈ విషయంలో కేసీఆర్‌తో సరిపోల్చగల నేత తెలంగాణ కాంగ్రెస్‌లో దివిటీ పెట్టి వెతికినా దొరకడు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసనలు తెలుపడం నేరం కాదు. ప్రభుత్వ నిర్ణయాలు తమకు నచ్చకపోతే ఏ వర్గమైనా వ్యతిరేకిస్తుంది. వివిధ రూపాలలో శాంతియుత నిరసనలు సాగించటంలో తప్పేమీ లేదు. రాజకీయపక్షాలు ఎన్నికల్లో పరస్పరం పోటీ పడినప్పటికీ అవేమి శత్రుపక్షాలు కాదు. కేసీఆర్ తొమ్మిదిన్నరేం డ్లుగా సుపరిపాలన అందించి ప్రజల మధ్యకు వస్తున్నారు. తాము సాధించింది ఏమిటో చెప్పుకొని ఓట్లు అడగడంలో తప్పులేదు. అదేవిధంగా ప్రతిపక్షాలు అధికార పార్టీ వైఫల్యాలు ఎండగట్టడం ద్వారా, తాము ఏమి చేయదల్చుకున్నామో చెప్పడం ద్వారా ప్రజల మద్దతు చూరగొనడానికి ప్రయత్నించాలె. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఏం చేస్తుందో చెప్పి నాలుగు ఓట్లు సంపాదించవచ్చు, నిర్మాణాత్మక పద్ధ తిలో ప్రచారం సాగించడం వల్ల ప్రజల మనస్సును దోచుకోవచ్చు. అంతేకానీ, ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం ద్వారా గెలవాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరం. 76 ఏండ్ల స్వాతంత్య్రంలో 55 ఏండ్లు పాలించిన రాజకీయ పక్షంగా ఉండి, తెలంగాణ అభివృద్ధికి ఆటంకంగా మారిన సమైక్యవాదులకు వంతపాడిన కాంగ్రెస్ ఇప్పుడేమో వెలగ బెడు తామని సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నది. ఎన్నికలకు సరిగ్గా 16 రోజులున్నయి. ఈ లోగా అన్నిపక్షాలు ఉద్రిక్తలు పెరగకుండా సంస్కారవంతంగా ప్రచారం సాగించితే తప్ప తెలంగాణ సమా జం మెప్పు పొందలేమనేది తెలియదేమో స్కాంగ్రెస్కు. తొమ్మిదేండ్లుగా జరిగిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీలో కూడా నిలబడలేదు సరికదా? ఎన్నిక ఏదైనా ఉద్యమనేత కేసీఆర్‌కే ప్రజలు పట్టంగట్టారు. వచ్చే ఎన్నికల్లో కూడా అదే జరుగుతుంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారానికి దూరమై పదేండ్లు కూడా కాలేదు. అప్పుడే వారిలో భరించలేని అధికార విరహవేదన. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారంలోకి రావాలనుకోవడం ప్రజాస్వామ్యంలో తప్పుకాదు. అందుకనుగుణంగా మ్యానిఫెస్టో ఉండాలి. ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు ఏం చేశామనే విషయం పట్ల నమ్మకం కలిగించినప్పుడు ప్రజాదరణ పొందడం సహజమే. కానీ, అబద్ధాలతో అందలమెక్కేందుకు కుంటిసాకులు చూపెట్టి అధికారంలోకి వస్తామని ప్రచారం చేసుకోవడం సరికాదు.
ప్రతిపక్ష హోదా కూడా లేని కాంగ్రెస్ నేతల హడావు డి చూస్తుంటే డిసెంబర్ 3 వరకు కూడా ఆగేటట్టులేరు. ఉమ్మడి రాష్ర్టాన్ని 42 ఏండ్ల పాటు పరిపాలించిన కాంగ్రెస్ ప్రత్యేక రాష్ర్టోద్యమాన్ని పట్టించుకోని ఫలితంగా ప్రజాగ్రహానికి గురై అధికారానికి దూరమైంది. కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ర్టాలలో అస్తవ్యస్తమైన పాలన, సీల్డు కవర్ల ముఖ్యమంత్రుల కొ ట్లాటలు, ఎవరికివారే యమునా తీరన్న మాదిరిగా పాలన సాగిస్తుండటం చైతన్యవంతమైన తెలంగాణలో చెల్లుబాటు కాదు. జాతీయ నాయకత్వం కారణంగా పూలు అమ్మిన చోట కట్టెలమ్ముకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిం దో కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉన్నది. కేవలం అబద్ధ్దాలతో అధికారం చేపట్టాలంటే భౌతిక పరిస్థితులు అనుకూలించాలి. వర్తమా న ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉండాలి. ఇంతకంటే భేష్‌గా పాలన కొనసాగిస్తామనే నమ్మకం కల్గించాలి. తాము అధికారంలో ఉన్న ఇతర రాష్ర్టాలలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు పోల్చి చెప్పితే ప్రజల ఆమోదం దొరుకుతుంది. అటువంటిది జాతీయ పార్టీగా ఉండి కేవలం తెలంగాణలోనే అమలు చేస్తామంటే కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు.
ప్రధానంగా 138 ఏండ్ల కాంగ్రెస్‌కు నెహ్రూ, ఇందిర, రాజీవ్, పీవీ తర్వాత ప్రజాకర్షక నాయకత్వం కొరత తీవ్రంగా ఉందని ఆ పార్టీనేతలే అంగీకరిస్తున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా అదే పరిస్థితి. ఉన్న వారిలో డజన్ మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు. పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే చరిష్మా ఉన్న నాయకుడు ఆ పార్టీలో ఒక్కరు కూడా లేరు. జాతీయ నాయకులు సభలో మా ట్లాడితే దాన్ని తెలుగులోకి అనువాదం చేసే తెలంగాణ నాయకుడే కాంగ్రెస్‌లో లేడంటే అతిశయోక్తి కాదు.
‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్టుగా అజ్ఞానంతో బీఆర్ఎస్ అభ్యర్థులపై దాడులకు దిగుతున్నారు. ఇటీవల దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యా ప్రయ త్నం, నిన్న అచ్చంపేట అభ్యర్థి గువ్వల బాలరాజుపై భౌతికదాడి చూస్తుంటే అధికారం కోసం పాతబస్తీలో చిచ్చుపెట్టిన రోజులు గుర్తుకొస్తున్నాయి. హత్యా రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నట్టుగా వారి తీరు కనిపిస్తున్నది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచా రం లో ప్రత్యర్థులను వ్యక్తిగతంగా దూషించి పదవి స్థాయిని తగ్గించుకుంటున్నారు.
అధికారం కోసం అడ్డదారులపై చూ పించిన శ్రద్ధ ప్రజల కండ్లల్లో కనిపించే ఆశలను అధ్యయనం చేయడంలో చూపించి ఉంటే బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఎదిగేదని ప్రజ లు అనుకుంటున్నారు. ఒక్క వ్యక్తిని ఓడించేందుకు ఢిల్లీ, ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్న నాయకులు కేసీఆర్‌పై ఎన్ని విమర్శలు చేసినా నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. మళ్లీ అధికా రం బీఆర్ఎస్దే. ప్రభుత్వం ఏర్పాటు చేసేది కేసీఆరే.
-డాక్టర్ సంగని మల్లేశ్వర్
98662 55355