రాష్ట్ర విభజన అనంతరం పదేండ్లపాటు ఉమ్మడి రాజధానిగానే కలిసి ఉన్నది హైదరాబాద్. తనదైన అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం ఒక్కో పుటను లిఖించుకుంటున్నది. ఈ సమయంలో మళ్లీ చాపకిం ద నీరులా ఆంధ్రా ప్రముఖుల విగ్రహాలు హైదరాబాద్‌లో పెట్టే కుట్రలు జరుగుతున్నా యి. ఎన్టీఆర్, రోశయ్య, బాలసుబ్రహ్మణ్యం ఇట్లా ఒక్కొక్క ఆంధ్రా ప్రముఖుల విగ్రహాలు మళ్లీ ఇక్కడ ఏర్పాటుచేస్తూ, తెలంగాణ బిడ్డల అరవై ఏండ్ల ఆకలిమంటల పోరాటాన్ని అవమానిస్తున్నారు. ఈ దుశ్చర్యలను తెలంగాణ సమాజం సహించబోదు. తెలంగాణ ఒక్క ఇంచు నేలను కూడా ప్రాంతేతరుల కోసం వదులుకోవడానికి సిద్ధంగా లేదు.
బాలసుబ్రహ్మణ్యం గొప్ప గాయకుడు. అందులో ఎవ్వరికీ ఏ సందేహమూ లేదు. కానీ, ఉద్యమకాలంలో ఆయన తెలంగాణ పాటను పాడనంటూ చేసిన అవమానాన్ని ఏ తెలంగాణ బిడ్డా మరిచిపోలేదు. అది కూడా అందెశ్రీ రచించిన పాటే కావడం గమనా ర్హం. మరి కాంగ్రెస్ సర్కార్ అందెశ్రీని, బాలసుబ్రహ్మణ్యంను ఒకే గాటన కట్టి తెలంగాణ కవులు, కళాకారులకు గుండెకాయ వంటి రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్ర హం పెట్టడాన్ని మేం ఖండిస్తున్నాం. బాలసుబ్రహ్మణ్యం విగ్రహంతో పాటు ట్యాంక్‌బండ్ మీద గత ఆధిపత్య పాలనకు చిహ్నాలుగా మిగిలిన ఆంధ్రా ప్రముఖుల విగ్రహాలు కూడా ఆంధ్రాకు తరలించి గౌరవించాలని డిమాం డ్ చేస్తున్నాం. తెలంగాణ సాంస్కృతిక పునర్నిర్మాణోద్యమంలో ఉద్యమకారులు, ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నాం!
ఈ సందర్భంగా 2025 డిసెంబర్ 7న ఆదివారం నాడు ఉదయం 10 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలంగాణ క్రాంతిదళ్’ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగనున్నది. ఈ సమావేశానికి తెలంగాణవాదులందరినీ ఆహ్వానిస్తున్నాం.