మొన్నటికి మొన్న ‘అమృత్ కాల్’ పేరుతో పార్లమెంట్ అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోదీ అక్కసు వెళ్లగక్కారు. కొత్తగా ఏర్పడిన రాష్ర్టాన్ని నిందిస్తూ పార్లమెంట్ సాక్షిగా మాట్లాడటం మోదీకి కొత్తకాదు. అయినా తెలంగాణ ఏర్పాటు,అస్తిత్వంపై అవమానకర వ్యాఖ్యలు చేయడం రాజనీతిజ్ఞత అనిపించుకోదు. ప్రధాని గతంలో కూడా తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అసూయ వెళ్లగక్కారు.
ఒక్క ఓటు రెండు రాష్ర్టాలు అని నాడు బీజేపీ చేసిన కాకినాడ తీర్మానం మరి చి పోయినట్టున్నారు. తెలంగాణ ఉద్యమం గురించి, రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన సుదీర్ఘ చర్చల ప్రక్రియ గురించి మోదీకి అవగాహన లేకపోతే ఆ పార్టీ సీనియర్ సభ్యులను ఎవరినై నా అడిగి తెలుసుకుంటే బాగుండేది. ఈ ఏడ్పు లు, పెడబొబ్బలు ఉండేవి కాదు. బీజేపీ వాల కం చూస్తుంటే తెలంగాణ ఏర్పాటు కాదన్న ఉద్దేశంతోనే, రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్ర ఏ ర్పాటుకు మద్దతు ఇచ్చినట్టుంది. అందుకే నీతిమాలిన మాటలకు తెగపడ్తున్నది. బీజేపీలో నాటి ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ లేనిలోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. కనీస విషయ పరిజ్ఞానం లేకుండా ఆంధ్ర లాబీ చేసిన ఆరోపణలనే ఉటంకించి, సమైక్యవాదులను భుజానేసుకొని తెలంగాణ సమాజాన్ని గాయపరచడం మోదీకి అలవాటుగా మారింది. పార్లమెంట్ తలుపులు మూసి ఏపీ విభజన చట్టా న్ని ఆమోదించారని చెప్పే ప్రధానికి అప్పుడు బీజేపీ సభ్యులు ఎందుకు మౌనం వహించారో తెలియదా? నోరున్నోడిదే రాజ్యమన్నట్టు నోటి కి ఏది తోస్తే అది మాట్లాడటం పరిపాటైంది. కానీ అది ఎల్లకాలం నడవదనేది నిర్వివాదాంశం.
బీజేపీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్కు దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ‘ప్రశ్నించే గొంతుక’ కేసీఆర్‌పై దిగజారి ఎదురుదాడి చేస్తున్నారు. మోదీ ఎలా డిక్టేట్ చేస్తే అలా రాజ్యం నడవాలనేది ఆయన సిద్ధాంతం. 60 ఏండ్లు ఉద్యమించి తెచ్చుకున్న తెలంగాణ పై దిగజారి మోకాలికి, బోడిగుండుకు ముడిపెట్టినట్టు కేసీఆర్‌ను కించపర్చి మాట్లాడటం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనం. ఎన్డీఏతో ఉన్నంతకాలం రాచరికపు వ్యవస్థ కన్పించదు. వారు బయటకు వెళ్లగానే రాజు లు, రాణులంటూ వ్యంగ్యాస్ర్తాలు విసిరిన మోదీ తీరును జనం ఈసడించుకుంటున్నారు.
నా కుటుంబ సభ్యులారా.. అంటూనే కూటమిలో ఉన్న శిరోమణి అకాలీదళ్, పీడీఎఫ్, శివసేన, టీడీపీ, జేడీయూలను తిమింగలంలా మింగేప్రయత్నం చేసింది బీజేపీ. అందుకే వారంతా ఎన్డీఏకు దూరమయ్యారు. అటువంటిది కేసీఆర్ ఎన్డీఏలో చేరే ప్రయత్నం ఎందుకు చేస్తారు? దేశంలో సమైక్య స్ఫూర్తిని దెబ్బతీ స్తూ, వ్యక్తుల మధ్య విష బీజాలు నాటే ప్రయ త్నం అడుగడుగునా చేస్తున్నది మోదీనే కదా? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నాలుగు సీట్లు రాగానే తెలంగాణలో అధికారం కోసం కలలు కని ఏకంగా ఎమ్మెల్యేలకు బేరం బెట్టి బజారు పాలై ప్రజల్లో ద్రోహులుగా మిగిలిపోయారు. దీంతో కేసీఆర్ కుటుంబంపై అక్కసు పెంచుకొని గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని తెలంగాణ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు. దశాబ్దాల తరబడి ఎదుర్కొన్న అవమానాలను భరించలేక ఉద్యమించి సాధించుకున్న తెలంగాణపై అత్యున్నత పదవిలో ఉండి అబద్ధాలకు తెరలేపడం మోదీ కుసంస్కారాన్ని బట్ట బయలుజేసింది. చతికిలబడ్డ బీజేపీని లేపడానికి బీఆర్ఎస్ను ప్రజాక్షేత్రంలో ద్రోహిగా నిలబెట్టే ప్రయత్నం చేయడం మోదీ దిగజారుడు తనానికి నిదర్శనం.
విభజన చట్టంలోని కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా, బయ్యారం ఉక్కు పరిశ్రమ స్థాపించకుండా పాలమూరు-రంగారెడ్డి లాంటి గొప్ప ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా వివక్ష కనబరుస్తున్నది కేంద్రం. తొమ్మిదేండ్లుగా ఆర్థిక ఆంక్షల పేరుతో అభివృద్ధిని అడ్డుకున్నా సీఎం కేసీఆర్ జడవలేదు. అభివృద్ధిలో దేశానికే తలమానికం గా నిలిపారు.
తెలంగాణ శాసనసభలో 90 శాతం బలమున్న బీఆర్ఎస్లో కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి కేసీఆర్ మోదీని అడగాల్సిన అవస రం ఎందుకొస్తదో ప్రజలే ఆ లోచించాలి. ఎన్నికలు వచ్చి నప్పుడల్లా నయానో భయా నో లొంగని బీజేపీయేతర ముఖ్యమంత్రులను అవినీతిపరులుగా చిత్రీకరించడం ఆయనకు కొత్తకాదు. ఢిల్లీ, పశ్చిమబెంగాల్, ఒడిశా, కర్ణాటక ఇలా అనేక రాష్ర్టాలపై బురదచల్లడం తెలియనిది కాదు.
ఇప్పటికే ఉత్తరాదిన సన్నగిల్లిన మోదీ గాలితో దక్షిణాదిన పాగా వేయాలనే కలలకు కర్ణాటక ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. దీంతో మతితప్పిన మోదీ అబద్ధాలకు తెరలేపి కేసీఆర్‌పై ఆరోపణలు చేయడాన్ని తెలంగాణ సమాజం జీర్ణించుకోవడం లేదు. తనను గౌరవించలేదని మాట్లాడే మోదీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు సీఎం కలుస్తానంటే నిరాకరించినప్పుడు ఈ గౌరవం గుర్తుకు రాలేదా?
కాంగ్రెస్ 91సార్లు తిట్టింది అంటాడు కానీ, అంతకంటే ఎక్కువ సార్లు తెలంగాణను ఆడి పోసుకున్నది మోదీనే. గోబెల్స్ ప్రచారానికి దిగిన ప్రధాని మోదీకి చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు రిట ర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయం. దేశంలో బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రత్యామ్నాయ వేదిక అధికారంలోకి వస్తుందనటంలో సందేహం లేదు.
– డాక్టర్ సంగని మల్లేశ్వర్ 98662 55355