దేశంలో ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ బ్లాక్స్లలో కేంద్రీయ, నవోదయ విద్యాలయాల స్థాయిలో విద్యను అందించే ఉద్దేశంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం 2013లో మాడల్ స్కూల్స్‌ను స్థాపించింది. వీటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు కేటాయించాలి. కానీ 2014 లో కేంద్రం వీటి నిర్వహణ నుంచి తప్పుకున్నది. దీంతో తెలంగాణ ప్రభుత్వమే పూర్తిగా మాడల్ స్కూల్స్‌ను నిర్వహిస్తున్నది. సీఎం కేసీఆర్ ఆశించిన కేజీ టు పీజీ విద్యలో మాడల్ స్కూల్స్ కీలక భూమిక పోషిస్తున్నాయి.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 194 మాడల్ స్కూల్స్ ఉన్నాయి. వీటిలో 3,880 ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 1,28,573 విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. మాడల్ స్కూల్స్‌లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం మాడల్ స్కూళ్ల నిర్వహణకు ఈ ఏడాది రూ.368 కోట్లు కేటాయించింది.
ప్రతి మాడల్ స్కూల్‌కు 5 ఎకరాల సువిశాల స్థలం, సొంత భవనాలు, సరిపడా మౌలిక వసతులు ఉన్నాయి. విద్యార్థుల కోసం సైన్స్ లాబ్స్, లైబ్రరీ, కంప్యూటర్లు ఏర్పాటు చేశా రు. ప్రతి పాఠశాలలో క్రీడా మైదానాలు ఏర్పరిచారు. విద్యార్థులందరికీ ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాం లు ఇస్తున్నారు. మధ్యాహ్న భోజన సదుపా యం కల్పిస్తున్నారు. ప్రతి మాడల్ స్కూల్‌కు అనుబంధంగా ఉన్న బాలికల హాస్టల్లో 100 మందికి వసతి కల్పిస్తున్నారు
ప్రభుత్వం తమపైన ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు అధికారులు, ఉపాధ్యాయులు శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నారు. ప్రతి ఏడాది టెన్త్, ఇంట ర్ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నా రు. ఈ ఏడాది పది ఫలితాల్లో 91.30 శాతంతో నాన్ రెసిడెన్షియల్ బడులు మొదటి స్థానంలో నిలిచాయి. 101 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. గతేడాది 541 మంది విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించారు. ఇంటర్మీడియట్లో 66 శాతం ఫలితాలు సాధించారు.
రాష్ట్రంలోని 87 మాడల్ స్కూల్స్ లో అటల్ టింకరింగ్ లాబ్స్ ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథ్స్ (STEM) బోధ న జరుగుతుంది. ప్రతి లాబ్‌కు రూ.22 లక్షలు నిధు లు మంజూరు అయ్యాయి. ప్రతిష్ఠాత్మక PMSHRI పథకానికి రాష్ట్రంలో 543 బడులు ఎంపిక కాగా అందులో 99 మాడల్ స్కూల్స్ కావడం విశేషం. ఈ పథకం కింద ఎంపికయిన బడికి రూ.కోటి నుంచి రెండు కోట్ల వరకు నిధులు రానున్నాయి. వీటి ద్వారా మాడల్ స్కూల్స్ మరింత అభివృద్ధి చెందనున్నాయి. మాడల్ స్కూల్స్‌లో డిజిటల్ బోధన ఏర్పాట్లు ఉన్నా యి. కరోనా సమయంలో అధికారుల ప్రోత్సాహంతో ఉపాధ్యాయులు వెబినార్ క్లాసులు నిర్వహించి ప్రశంసలు పొందారు
విద్యతో పాటు వృత్తి శిక్షణ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో 194 మాడల్ స్కూల్స్‌లో వొకేషనల్ విద్యను ప్రవేశపెట్టారు. వీటి ద్వారా 12 రంగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. యుక్త వయసులోనే ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశం.
ఈ ఏడాది మాడల్ స్కూల్స్ నుండి 696 మంది విద్యార్థులు నేషనల్ మీస్ కం మెరి ట్ స్కాలర్ షిప్ (NMMS)కు ఎంపికయ్యా రు. వారికి ఏడాదికి రూ.12000 చొప్పున 4 ఏండ్లపాటు స్కాలర్షిప్ అందిస్తారు. ఇంటర్ పాసయిన అనేకమంది విద్యార్థులు MHRD స్కాలర్షిప్కు ఎంపిక అయ్యారు.
మాడల్ స్కూల్ విద్యార్థులు కళోత్సవ్, ఇన్స్పైర్, జవహర్లా ల్ నెహ్రూ సైన్స్ ఎగ్జిబిషన్, సైన్స్ డ్రామా వంటి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటూ ఉ త్తమ పురస్కారాలు పొందుతున్నారు. జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తున్నారు. మొదటి బ్యాచ్‌లో చదివిన చాలా మంది విద్యార్థులు వివిధ రంగాల్లో ఉద్యోగాలు సాధించి రాణిస్తున్నారు.