ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు మాత్రమే కాదు, అది మౌలికంగా వ్యక్తిగత స్వేచ్ఛ, స్వాతంత్య్రం గురించి నిర్వచిస్తుంది. సామాజిక నియమాలు, సంస్కృతి ఏ ప్రభుత్వంలోనైనా ఉండొచ్చు. కానీ, ప్రజాస్వామ్యం, దాని సంస్కృతి, ఆచరణ, స్ఫూర్తి మాత్రం ఒక దేశాన్ని, ఆ దేశంలోని వ్యక్తులను సాధికారికం చేయడం ద్వారా వారి ఉన్నతికి, ఉద్ధరణకు తోడ్పడాలి. అదే ప్రజాస్వామ్యం ప్రధాన ఉద్దేశం.
ప్రముఖ రచయిత సి.ఎస్ లూయిస్ రాసిన ఓ వ్యాసంలో ఇలా చెప్పారు. ‘ఏ వస్తువును అయినా, రచనను అయినా విమర్శించేందుకు మొదటి అర్హత ఏమిటంటే.. ముందుగా దాని గురించి తెలుసుకోవడం. అది కార్క్ స్క్రూ అయినా కావచ్చు, పవిత్ర స్థలం అయినా కావచ్చు. దాని ఉద్దేశమేమిటి? దాన్ని ఎలా ఉపయోగించాలో తొలుత తెలుసుకోవాలి. ఆ తర్వాత దాన్ని చెడు ఉద్దేశం కోసం తయారు చేశారని నిర్ణయానికి రావచ్చు. మీకు తెలియనంత వరకు దాని గురించి సరిగ్గా చెప్పలేరు, విమర్శించలేరు’.
ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు మాత్రమేనని భావించడం తప్పు. ప్రజాస్వామ్యమంటే ఓట్లు వేయడం, నాయకులను ఎన్నుకోవడం మాత్రమే కాదు. వ్యక్తి స్వాతంత్య్రాన్ని ప్రభుత్వం అణచివేస్తే నిరంకుశత్వ ప్రభుత్వానికి, ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వానికి మధ్య ఎలాంటి తేడా ఉండదు. ఎందుకంటే, రెండింట్లోనూ భావవ్యక్తీకరణ స్వాతంత్య్రాన్ని అడ్డుకోవడం, ప్రజాభిప్రాయాన్ని నియంత్రించడం, నియంతలాగా ఏక వ్యక్తి ఆలోచనలు అమలు చేయడమే జరుగుతుంది.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా న్యాయమూర్తి తీర్పు ఇవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే, ప్రజాస్వామ్యంలో వ్యక్తుల స్వాతంత్య్రాన్ని రక్షించేందుకు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిలబడే అధికారం న్యాయమూర్తికి ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ నిరంకుశత్వం నుంచి వ్యక్తులను న్యాయమూర్తి విముక్తి చేయాలి.
ప్రభుత్వం ఎప్పుడూ వ్యక్తులను నియంత్రించాలనే చూస్తుంది. ప్రభుత్వ నిర్ణయాలు కూడా ఆ దిశలోనే ఉంటాయి. ఎందుకంటే, వ్యవస్థకు ఎల్లప్పుడూ వ్యక్తి స్వేచ్ఛ అడ్డంకిగా అనిపిస్తుంది. పైన చెప్పిన వ్యాఖ్యల అర్థం, పరమార్థాన్ని మీరు మన దేశంలో జరిగిన, జరుగుతున్న ఏదేని ఘటనతో పోల్చి చూసుకోవచ్చు. ఏదైనా ఒక్క ఘటన గురించి మాట్లాడటం కంటే, ఒక రచయితగా మన దేశం ఎటు వెళ్తున్నదో, దేశంలో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయనే అంశాలపైనే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ప్రభుత్వం చేస్తున్న మార్పుల (చట్టాలు) వల్ల సాధారణ ప్రజానీకం ఎలా ప్రభావితమవుతున్నదో, ఆ మార్పుల పట్ల ఎలా స్పందిస్తున్నదో గమనిస్తుంటాం. అయితే, ఇప్పుడు వాటి గురించి వివరించాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే, అవి చాలా కాలం నుంచి (ఈ ప్రభుత్వ పాలనలో మనం ఇప్పటికే 12వ సంవత్సరంలో ఉన్నాం) జరుగుతూనే ఉన్నాయి. ప్రజామోదం కూడా పొందాయి. ఆసక్తి ఉంటే వివరాలను పరిశీలించి ఇక్కడ జరుగుతున్నది వ్యక్తి సాధికారతను, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుం దా? లేదా దానికి విరుద్ధంగా ఉందో ఒక అంచనాకు రావచ్చు. ప్రభుత్వం మనల్ని ఒక నిర్దిష్ట దిశలో నడిపిస్తున్నది. ప్రస్తుత పాలనలో చాలా కాలం నుంచి మనం నిస్సారమైన పరిస్థితుల్లో వదిలివేయబడ్డాం. చట్టాల ద్వారా ఆ దిశ మనకు వెల్లడవుతుంది. మీరు బాగా సమర్థవంతంగా నిర్వహిస్తు న్న నిరంకుశత్వాన్ని కలిగి ఉండొచ్చు. ప్రపంచవ్యాప్తంగా, మన పొరుగు దేశాల్లో నిరంకుశత్వ ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. వ్యక్తి తనకు ఇష్టం ఉన్నా, లేకున్నా స్వా తంత్య్రం, స్వేచ్ఛను వదులుకోవాల్సి ఉంటుంది.
వ్యవస్థాగత అణచివేతలో వికసించే ప్రజాస్వామ్య ఉదాహరణలు మనకు ఎక్కడా కనిపించవు. స్వేచ్ఛను ఇవ్వడం ద్వారా మాత్ర మే ప్రజాస్వామ్య ఫలాలు అందుతాయి, అణచివేత ద్వారా కానే కాదు. స్వేచ్ఛ ఉన్న వ్యక్తి మరింత ఉత్పాదకతతో, సృజనాత్మకంగా, సామర్థ్యంతో ఉంటాడని గుర్తించాలి. ఇందుకు విరుద్ధమైన మార్గం విజయం వైపు దారితీయదు. స్వేచ్ఛను అణచివేయడం ద్వారా విజయం సాధించలేం. విజయమంటే వ్యక్తులు, సమూహాలను వ్యవస్థాగతంగా, అనవసరంగా అడ్డుకోవడం, తద్వారా ఆనందించడం కాదు.
వీటిలో సంవత్సరాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే, సంవత్సరాలవారీగా ఈ చట్టాలు ఒక దిశను చూపుతున్నాయి. ఈ రోజు మనం ఉన్న స్థితికి అవి మనల్ని తీసుకొచ్చాయి. వార్తా కథనాలను ఆక్రమించే ఘటనల వెనుక ఇప్పుడు చట్టం ద్వారా అమల్లో ఉన్న ఈ నిర్మాణం ఉంది. ఈ నిర్మాణం దృఢంగా మారిపోయింది.
-ఆకార్ పటేల్