ఆ:వె కేసియారు వెంట కెరటాలవలె జనుల్
కలసిమెలసి పోరు సలిపినారు
నాటి పోరు పలము మేటి తెలంగాణ
మరువలేము మిమ్ము మాన్యవర్య!
ఆ:వె మేలు చేయదలచి మిషను భగీరథ
పేరుపెట్టె తాగు నీరుకొరకు
మనసు మంచిదైన మార్గంబు దొరకును
మరువలేము మిమ్ము మాన్యవర్య!
ఆ:వె మిషను కాకతీయ మేలైన పథకమ్ము
చెరువులన్ని నిండి చేరువయ్యె
సాగుభూములన్ని శ్యామలమ్ముగనయ్యె
మరువలేము మిమ్ము మాన్యవర్య!
ఆ:వె రెండుగదుల ఇళ్ళు పండుగై మొదలెట్టి
ఇళ్ళులేని వారికిచ్చు చుండె
వసతి చేసినట్టి ప్రభుతకు వెయ్యేళ్ళు
మరువలేము మిమ్ము మాన్యవర్య!
ఆ:వె ఆర్తితోడ ప్రభుత అంగవికలులకు
వేరు దిక్కులేని వృద్ధులకును
ఆసరాగ నిలిచి యందించె పించెను
మరువలేము మిమ్ము మాన్యవర్య!
ఆ:వె పెళ్ళిచేయలేని పేద వారింటికి
ప్రభుత ఇచ్చినట్టి వరముచేత
కదిలివచ్చెనయ్య కళ్యాణ లక్ష్మియే
మరువలేము మిమ్ము మాన్యవర్య!
ఆ:వె పేదవారి చదువు పెనుభారమవ్వగా
పుస్తకాలు కూడు బుడతకిచ్చి
కడుపునిండ కూడు కమ్మగాపెట్టెనే
మరువలేము మిమ్ము మాన్యవర్య!
– దరిపెల్లి కృష్ణమాచార్యులు,
93817 95140