ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం అంధకారమయం. సరైన సాగు, తాగునీరు లేదు. సంక్షేమ పథకాలు లేక ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. నేడు ‘సంక్షేమం అంటే ఇది’, ‘అభివృద్ధి అంటే ఇలాగే ఉంటుంద’ని నిరూపిస్తున్నది తెలంగాణ. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్‌ది. టీఆర్ఎస్ అంటే నాడు ఉద్యమ పార్టీనే. కానీ, నేడు ‘టీఆర్ఎస్’ అంటే సామాన్యుడి గెలుపు,సామాన్యుడి ప్రగతి అని యువత ఈ ప్రపంచానికి చాటి చెప్పాల్సిన సమయం ఆసన్నమైనది.
అందుకే టీఆర్ఎస్ అన్నా, కేసీఆర్ అన్నా ప్రజలకు ఒక నమ్మకం, ఒక భరోసా. అర్జునుడి రథసారధిగా కృష్ణుడు ఏ విధంగా నడిపించాడో తెలియదు గానీ, తెలంగాణ అభివృద్ధికి రథసారథిగా కేసీఆర్ కృషి మాత్రం అద్భుతం. అందుకే యువతా మే(ఏ)లుకో.. కేసీఆర్‌పై మనకున్న భరోసా ఏమిటో మునుగోడు ద్వారా మరోసారి నిరూపించు.
శ్రీనివాస్ కాదాసు 91773 86586