అవును ఇప్పటి పూలల్లో
సువాసనే లేదు.
ఎందుకు ఒకసారి వాటినే
అడగాలనిపించింది.
కానీ…
సహజంగానే పుట్టాయి కదా
మరి ఎందుకు అడగాలి అని!
మరో ప్రశ్న నన్నడుగుతూనే!
పండ్లను తింటే
తీయదనం తక్కువగా ఉన్నా
ఐనా సరిపెట్టుకొన్నా!
ఈసారి వేరే కొందామనుకొని!
ప్రేమే లేని అనుబంధాలను
నిత్యం భూమిని
తాకుతున్నాయనిపించి.
పూల మొక్కలకు, పండ్ల చెట్లకు
నిత్యం నీళ్లు పడుతున్నా!
అవి అందించే ఫలితాలెందుకో
దారితప్పాయా మరి!
అవి నాలో అనుమానం పెరుగుతూ
కొత్త వాటిని వెతుకుతున్నా..
సారవంతమైన భూమిలో
నిస్వార్థ ఫలాల జాడ తప్పినా..
మనిషిగా మమకారాలు
నిత్యం పెంచుకుంటూనే ఉన్నా…
నాలోని మంచితనాన్ని
నిత్యం పంచి పెడుతున్నా..!
అయినా కొత్త పూల చెట్లు
కొత్త పండ్ల చెట్లు రోజురోజుకు
ఏపుగా పెరుగుతూనే ఉన్నా
మరోవైపు
ఆత్మలేని ఆత్మీయులు
నిస్వార్థంగా మరెందరో
మళ్లీ మళ్లీ పుడుతూనే ఉన్నారు!
-డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్, 94908 41284