జీవో-29. అసలేంటీ జీవో? ఎస్టీ, ఎస్టీ, బీసీల వంటి బలహీనవర్గాలు తమ జీవన్మరణ సమస్యగా భావించి రోడ్లపైకి వచ్చి ప్రభుత్వంపై ఎందుకు పోరాడుతున్నాయి.? ఏముందీ జీవోలో? ఎవరికోసం ప్రభుత్వం దీన్ని తీసుకువచ్చింది, గోప్యంగా ఎందుకు ఉంచుతున్నది? దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని ప్రభుత్వం అణచివేయాలని ఎందుకు చూస్తున్నది? ప్రభుత్వాలు ఉన్నదే బలహీన వర్గాలకోసం అయినప్పుడు ఇంత తీవ్రమైన సమస్యను వినేందుకు ఎందుకు ముందుకురావడం లేదు? సున్నితమైన రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం మొండిగా వెళ్లాల్సిన అవసరం ఏమున్నది? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి నోటిఫికేషన్ కావడం, భారీ స్థాయిలో గ్రూప్-1 ఉద్యోగాలను భర్తీ చేస్తుండటం, ప్రభుత్వ పాలనలో, విధానాల రూపకల్పనలో అత్యంత కీలక స్థానంలో ఉండటం, తమ సామాజిక హోదా, గుర్తింపును పెంచుకొనే గొప్ప అవకాశం ఉండటంతో సహజంగానే గ్రూప్-1 పరీక్షపై ఎంతో క్రేజ్ ఉన్నది. దీంతో గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడగానే నా లాంటి అభ్యర్థుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే పేద విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ పేద విద్యార్థులకు తమ తలరాతను తామే మార్చుకునే సువర్ణావకాశం ఇది.
రాష్ట్రంలో 90 శాతానికి పైగా ఎస్టీ, బీసీ లే ఉన్నారు. తెలంగాణ ఏర్పడిందే వారి ప్రయోజనాల కోసం. అట్టడుగు వర్గాలకు అందని ద్రాక్షగా ఉన్న గ్రూప్-1 అనేది సంపన్నుల ఉద్యోగమనే ఆనవాయితీ ఉండేది. అయితే, రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ద్వారా గ్రూప్-1 ఉద్యోగం పేదలకు చేరాలని భావించిన గత ప్రభుత్వం సాహసోపేతంగా జీవో 55 ను తీసుకొచ్చింది.
జీవో 55 ఏమిటో స్పష్టంగా చెప్పాలంటే గ్రూప్-1 పరీక్ష అన్ని దశల్లో (ప్రిలిమ్స్, మెయిన్స్) రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల అమలే దీని లక్ష్యం. ఇంకా చెప్పాలంటే మెరిట్‌తో పాటు రిజర్వేషన్లకూ ప్రాధాన్యం ఇవ్వ డమన్న మాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఓపెన్ క్యాటగిరీలో ఎవరైనా పోటీ పడవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌తో పాటు ఇతర అగ్రకులాల మెరి ట్ ఆధారంగా పోటీ పడొచ్చు. ఆ తర్వాత ఓపెన్ క్యాటగిరీలో సెలెక్టయినా బలహీన వర్గాల అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోకుండా ఆ కలిగిన బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులను తమ రిజర్వేషన్ క్యాటగిరీలో ఎంపిక చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇటు ఓపెన్ క్యాటగిరీలో, అటు వారికి హక్కుగా ఉన్న రిజర్వేషన్ క్యాటగిరీలో పోటీపడుతారు, ఉద్యోగాలు సాధిస్తారు. ఉదాహరణకు.. వంద ఉద్యోగాలుంటే అందులో యాభై ఓపెన్ క్యాటగిరీలో ఉంటే ఎవరైనా (ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రకులా లు) ప్రతిభ ఆధారంగా పోటీ పడవచ్చు. మిగతా యాభై కోసం మాత్రం రిజర్వేషన్ల ఆధారంగా ఆయా సామాజిక వర్గాలకు చెందిన వారు పోటీ పడతారు (ఓపెన్‌లో ఎంపికైనా బలహీన వర్గాల వారిని తీసివేసి మిగతా వారిని ఎంపిక చేస్తారు).
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన హైకోర్టులో జీవో 55పై గతంలో ఉన్న దృష్ట్యా (జీవో 55 తప్పు అని హైకోర్టు ఇప్పటివరకు చెప్పలేదు) పబ్లిక్ ఇం ట్రెస్ట్ సాకుతో రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్స్‌ను అణచివేస్తూ జీవో 29ని తీసుకువచ్చింది. 29 ఏం చెప్తున్నదంటే.. గ్రూప్-1 ప్రిలిమ్స్ దశలో మెరిట్ ఆధారం గా మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు. అంటే మొత్తం ఉద్యోగాలను (రిజర్వేషన్ ఉద్యోగాలను కలిపి) ఓపెన్ క్యాటగిరీగా పరిగణిస్తూమెరిట్ ఆధారంగా పరీక్షకు ఎంపికచేస్తారు. ఎవరైనా ఎంపిక కావచ్చు. ఒకవేళ మెరిట్ ఎంపికైన మొత్తం అభ్యర్థుల్లో బలహీనవర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలు (1:50) నిష్పత్తిలో లేకపోతే అదనంగా తక్కువ ఉంటే అంతమందిని ఎంపిక చేస్తారు.
1.మెరిట్ ఆధారంగా ఎంపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులనే మెరిట్‌గా, రిజర్వేషన్ అభ్యర్థులుగా పరిగణిస్తారు. 2.ఒకవేళ మొత్తం మెరిట్ అభ్యర్థుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు (1:50) నిష్పత్తిలో సరిపడా ఉంటే తర్వాత రిజర్వేషన్లు అనేది వారికి ఉండదు. ఉదాహరణకు.. వంద ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఉంటే అందులో 50 ఉద్యోగాలు మెరిట్ ఆధారంగా ఓపెన్ క్యాటగిరీ అనుకుంటే మిగతా 50 రిజర్వేషన్ ఉద్యోగాలు. వీటికి ఎస్సీ, ఎస్టీ, బీసీలే అర్హులు. ఇప్పుడు జీవో 29 ఏం చేప్తున్నదంటే.. 100 ఉద్యోగాలను (50 రిజర్వేషన్ ఉద్యోగాలతో సహా) మొత్తంగా పరిగణించి మెరిట్ ఆధారంగా (1:50) నిష్పత్తిలో ఎం పిక చేస్తారు. అంటే 100 X 50=5,000 అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు. ఎంపికైన 5 వేల మందిని మెరిట్ ఆధారంగా (1,25,000) వరకు ఎవ రుంటే వారిని (లోకల్, నాన్‌లోకల్) సంబంధం లేకుం డా ఎంపిక చేస్తారు. మెరిట్‌కు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల రిజర్వేషన్ అభ్యర్థుల ప్రయోజనాలను జీవో 29 నిండా ముంచింది.
కేస్-1: జీవో 29 ప్రకారం… మొత్తం ఉద్యోగాలు 100 అనుకున్నాం కదా, ఇందులో 50 ఓపెన్ క్యాటగిరీ, మరో 50 రిజర్వేషన్ అనుకుంటే మొత్తం 100 ఉద్యోగాలను మెరిట్ ఆధారంగా 100X 50= 5000 మొత్తంగా ఎంపిక చేస్తారు. ఇప్పుడు రిజర్వేషన్ ఉద్యోగాలు 50 అంటే వీరిని 150 చొప్పున 2,500 మందిని ఎం పిక చేయాలి. మనకు మెరిట్ ఆధారంగా ఎంపిక చేసిన 5,000, రిజర్వేషన్ల ఆధారం గా ఎంపిక చేసిన 2,500 మందిని మొత్తం గా 7,500 మందిని ఎంపిక చేసి ఉంటే (5000+2500=7500) ఈ రోజు న్యాయస్థానాల్లో జీవో 29 ఉండేది కాదు. నిరుద్యోగులు పోరాడే వారు కాదు.
కేస్-2: మొత్తం 100 ఉద్యోగాలను ఓపెన్ క్యాటగిరీగా అనుకొని మెరిట్ ఆధారంగా ఎంపిక 5000 మంది అభ్యర్థుల్లో 2,500 మంది మెరిట్ రిజర్వేషన్ అభ్యర్థులు ఆ 5,000 మంది అభ్యర్థుల్లో ఉంటే వారిని రిజర్వేషన్ అభ్యర్థులుగానే పరిగణిస్తారు. ఇంకా రిజర్వేషన్ అనేది ఉండదు. రిజర్వేషన్లు అమలుచేయాల్సిన అవసరం స్థూలంగా చెప్పాలంటే రిజర్వేష న్లు అభ్యర్థులను (1:50)కి జీవో 29 కుదిస్తున్నది.
ప్రతిభ ఉన్న బీసీ-బీ, బీసీడీ అభ్యర్థుల కలలకు జీవో 29 మరణ శాసనమే. ఎందుకంటే వారు మెరిట్‌లోనే ఎంపికయ్యారు, కాబట్టి ఇక వారి రిజర్వేషన్లు వారికి అమలు చేయాల్సిన అవసరం లేదు. మెరిట్లో నే (1:50చొప్పున) సరిపడా బీసీ-బీ, బీసీ-డీ అభ్యర్థులున్నారు. ఇక వారికి రిజర్వేషన్లు అమలు చేయనవసరం లేదు. జీవో 29 ద్వారా రిజర్వేషన్లు ఎలా అందుతున్నాయో ఒకసారి చూస్తే బీసీ-బీ, బీసీ-డీ అభ్యర్థులకు ‘సున్నా’ రిజర్వేషన్ (వారు సరిపడా మెరిట్‌లోనే ఉన్నారు కాబట్టి) ఉదాహరణకు.. నోటిఫికేషన్లో పేర్కొన్న బీసీ-బీ ఉద్యోగాలు 37. వీరిని 1:50 చొప్పున తీసుకుంటే అభ్యర్థులను ఎం పిక చేయాలి, కానీ 7,500 బీసీ-బీ అభ్యర్థులను ఎం పిక చేశారు. మొత్తం పోస్టులను ఓపెన్ క్యాటగిరీగా పరిగణించడంతో 28,000 మంది అభ్యర్థుల్లో 7,500 మంది బీసీ-బీ అభ్యర్థులు ఉండటంతో మళ్లీ అదనం గా వారి రిజర్వేషన్ అమలుచేయాల్సిన అవసరం రాలేదు.
ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు: వీరిని రిజర్వేషన్ ప్రాతిపదికన మాత్రమే ఎంపిక చేశారు, మెరిట్లో ఎంపికైనా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను రిజర్వేషన్ కోటాగానే పరిగణించారు. ఉదాహరణకు అభ్యర్థులకు రిజర్వేషన్ ఉద్యోగాలెన్ని ఉన్నాయో అంత మంది (1:50) చొప్పు న ఎంపిక చేశారు. దీంతో ఎస్సీ అభ్యర్థులకు మెరిట్ ప్రయోజనాలు దక్కలేదు. ముచ్చటగా మూడోసారి కూడా గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యం, సందేహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షలో బలహీనవర్గాల వారికి రిజర్వేషన్లనేవి గుండెకాయ వంటి వి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి అట్టడుగు వర్గాలు గౌరవప్రదంగా బతుకాలంటే ఉద్యోగమనేది కీలకం.
ఆ ఉద్యోగం సాధించాలంటే గుండె కొట్టుకోవడం (రిజర్వేషన్లు) తప్పనిసరి. కీలకమైన రిజర్వేషన్లకు సం బంధించిన జీవో 29ను ఉంచాల్సిన అవస రం ఏమున్నది? జీవో 55 కంటే జీవో 29లో ఎక్కువ ప్రయోజనాలున్నాయని ప్రభుత్వం భావించి ఆ విషయాన్ని విద్యార్థులకు వివరించాలి. కానీ, ఈ విషయంలో అటు ప్రభుత్వం, ఇటు టీజీపీఎస్సీ విఫలమయ్యాయి. టీజీపీఎస్సీ ఉన్నదే కోసం కదా, అలాంటప్పుడు ప్రభుత్వాన్ని సంతృప్తి పరచడం కంటే నిరుద్యోగులకున్న అసంతృప్తిని, అనుమానాల ను తొలగించి ఉంటే బాగుండేది. జీవో 29 న్యాయస్థానాల్లో నిలబడేది కాదు.
ఎందుకంటే ఓపెన్ క్యాటగిరీ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అభ్యర్థుల అవకాశాలను తగ్గించడం, రిజర్వేషన్ ఉద్యోగాల్లో అభ్యర్థుల అవకాశాలను తగ్గిస్తున్నది (కారణం మెరిట్ సాధించిన రిజర్వేషన్ అభ్యర్థులను ఇటు ఓపెన్ క్యాటగిరీలో అటు రిజర్వేషన్ల అభ్యర్థులుగా వారినే పరిగణించండి). జీవో 29 మెరిట్‌కే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఓపెన్ క్యాటగిరీలో జీవో 55 (ఇందులో 10 వేల మందికి) కంటే జీవో 29లో (ఇందులో 28 వేల మంది) మూడు రెట్లు అధికంగా ఓపెన్ క్యాటగిరీలో అవకాశం ఉండటంతో ఎక్కువ మెరిట్ సాధించే హైగకులాలు, నాన్ లోకల్స్ అవకాశాలను పెంచింది.
టీజీపీఎస్సీ ఓపెన్ క్యాటగిరీలో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో, అందులో నాన్ లోకల్స్, ఓసీ లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎంతమంది సెలెక్టయ్యా రో చెప్పలేదు. పాత పేపర్లతో ప్రతిష్ఠాత్మక గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను నిర్వహించడం ఎందుకని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ‘మల్టీ జోనల్‌స్థాయి పోస్టులను రాష్ట్రస్థాయి పోస్టులుగా పరిగణించి మెరిట్ ఆధారంగా ఎలా ఎంపిక చేస్తారు. ఇది రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన కిందికి వస్తుంది. మొత్తం ఉద్యోగాలను (ఓపెన్ క్యాటగిరీ 209+354 రిజర్వేషన్ ఉద్యోగాలని కూడా) ఓపెన్ క్యాటగిరీగా ఎలా పరిగణిస్తారు. దీనివల్ల నాన్ లోకల్స్ భారీగా ఎంపికయ్యే అవకాశం ఉన్నదని గ్రూప్-1 అభ్యర్థుల సందేహం. టీజీపీఎస్సీనే రిజర్వేషన్లు పాటించడం లేదని హైకోర్టు చెప్పడం గమనార్హం.
ప్రభుత్వం పోతున్నది. మా దుఃఖాన్ని దిగమింగుకొని న్యాయస్థానాల్లోనైనా న్యాయం దక్కుతుందనే విశ్వాసంతో పైసా పైసా పోగు చేసుకొని కోర్టులను ఆశ్రయిస్తే తలుపులు మూసేసింది. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు జీవో-29 వ్యతిరేకమని న్యాయమూర్తులను ప్రార్థిస్తే సాంకేతిక కారణాలతో, కేసు వేయడంలో జాప్యం జరిగిందని డిస్మిస్ చేశారు. ప్రభుత్వానికి న్యాయస్థానాలు అండ గా నిలిచాయని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పడం ఇటు నిరుద్యోగులను, అటు న్యాయ కోవిదులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం పంతానికి పోకుండా జీవో-55 ప్రకా రం ప్రస్తుత గ్రూప్-1 ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగులంతా వేడుకుంటున్నారు. జీవో 29 రాజ్యాంగబద్ధమా లేదా రిజర్వేషన్లకు వ్యతిరేకమా అని ఎవరు తేల్చాలి?
– శ్రవణ్‌కుమార్, నిరుద్యోగి