మట్టిభోజనంబు మనజీవజాతికి
చెట్లు ప్రాణమివ్వ చేవతోడ
పంచభూతములపరగప్రజలకిల
హితముసల్పుసతము యింపుమీర!
మట్టిరుచినిజూడు మహిమలన్నిదెలియు
కర్షకులకు నిచ్చుకౌగిలింత
నాగలిజూచియెంత నగుమోముజూపును
వర్షధారతోడ వగలుబోవు!
పంచభూతములును ప్రజలకుమేలుకొరకు
సహకరించుచుండు సంభరమున
సూర్యచంద్రులంతసృష్టికేమూలమ్ము!
సకలజీవరాశిమహిన సాకగలరు!!
వర్షధారవలన వనగూడుపంటలు
నీరులేకబ్రతుకు నిల్చుటెట్లు?
పొలముపైనవాన పూర్తిగాకురిసిన
పుడమిలోనిజనుల పులకరింత!
హాలికులునులేక నవనికిబ్రతుకేది?
సర్వకార్యగతులు సవ్యముగను
నడుపగల్గినట్టి నవ్యజ్ఞానులువారు
కష్టయిష్టములకు కరుకుదేలి!
ప్రకృతికెపుడుమనము పరగరక్షించగ
మనదువంతు విధియుమరువరాదె!
మొక్కలెన్నొమనము మోదమునను
నాటిపెంచిజూడ నవ్యజ్ఞాని!!
చెట్లునరకమనకు చేటుయెకల్గును
వర్షమింతరాదు వరపుజూడ
మొక్కలెన్నొనాట మేలునెంతోగల్గు
చేయవలదుతప్పు చెడునుప్రకృతి!!