ఆ బక్క పల్చటి మాటే ఉద్యమ మంత్రం
వొంటూపిరైన పిడికిలే ఉద్యమ ప్రాణం
ఆయన నినాదం తెలంగాణం
అతడు నెత్తుటి చుక్క నేల రాలకుండ
ఉద్యమాన్ని నడిపిన సత్యాగ్రాహి
సకల జనాన్ని కదిలించిన సంగ్రామి
ఎన్నెన్నో అడ్డంకులు
చెప్పలేని వొడిదొడుకులు
వెనుతిరిగి చూడని అతడి గుండె ధైర్యం
ఈ నేల ఉన్నంతకాలం
తెలంగాణ గుండెల్లో నిలిచి ఉంటుంది
గుక్కపట్టిన బిడ్డకు తల్లి స్తన్యమైన కేసీఆర్…
నువు ఉద్యమ తల్లికోడివి, కార్యసాధకునివి
అస్తమించి ఉదయించిన పొద్దు పొడుపువి
స్వరాష్ట్ర పుట్టుకకు పురుడుపోసిన మంత్రసానివి
కేసీఆర్ చెరిపితే చెరిగే గీత కాదు
అది రగిలే ఉద్యమ గీతం
అస్తిత్వ ఉద్యమ అధ్యాయం
ద్రోహులెవరో వీరులెవరో
దొంగలెవరో ధీరులెవరో
ఉద్యమాన్ని చూసిన కళ్లకు తెలుసు
ఈ మటికి తెలుసు..
ఎగిసిపడ్డ పోరుల్ని
వీరుల త్యాగాలను చూసింది
గెలిచి నిలిచింది స్వరాష్ట్ర ఉద్యమమే
ఆధిపత్యాల మెడలు విరిచిన
బాహుబలివి,
చెట్టుకొకరు పుట్టకొకరనైనోళ్లందర్నీ
ఒక్కతాటిపైకి తెచ్చిన వొంటివూపిరోనివి
కరువు నేలను పచ్చటి
మాగాణం సేయడానికి
కన్నీరు పెట్టిన నేలను
పున్నమి ఎన్నెల సేయడానికి
రేయింబవళ్లు చాకిరి చేసినోడివి
కేసీఆర్ నువ్వు సంజీవనివి.
తెలంగాణ నుదుటి బొట్టువి.
– జూలూరు గౌరీశంకర్