అసాధ్యం అనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసిన దార్శనికుడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సంస్కృతి సంప్రదాయాలు, పండుగలను గౌరవిస్తూ బంగారు తెలంగాణ నిర్మాణానికి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది.
బంజారాహిల్స్‌లో బంజారాభవన్ నిర్మించాలని ఎన్నో ప్రభుత్వాలను వేడుకున్నా కనీసం 500 గజాల స్థలం కూడా ఇవ్వలేదు. కానీ స్వరాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే భవన్ నిర్మాణానికి అడిగిన వెంటనే బంజారాహిల్స్‌లో కోట్ల రూపాయల ఖరీదైన రెండుఎకరాల స్థలాన్ని కేటాయించి బంజారా సేవాలాల్ మహారాజ్ భవనం, కొమురంభీం ఆదివాసీ భవనం నిర్మింప జేయడం వారి సహృదయతకు నిదర్శనం. ఆ భవనాలను హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసిన రోజైన సెప్టెంబర్ 17న ప్రారంభించడం సంతోషకరం. అడవితల్లి ఒడిలో పుట్టిన గిరిజనబిడ్డలు ప్రకృతిని నమ్ముకొని ప్రతికూల పరిస్థితుల మధ్య బతుకుతున్నారు. అలాంటి గిరిజనులకు రాజధానిలో భవనాలను ఏర్పాటు చేయడం బంజారా, ఆదివాసీ సమాజానికి మరిచిపోలేని శుభ పరిణామం. గిరిజన సమాజం అభివృద్ధి వైపు అడుగులు వేసే విధంగా తెలంగాణ సర్కార్ ఎన్నో పథకాలు రూపొందించింది. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తండాలను గ్రామ పంచాయతీలు చేశారు. ‘మా తండాల్లో మా రాజ్యం’ అన్న గిరిజనుల కలను సాకారం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే.
శ్రీకాంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని తొలిసారి రూ.10 కోట్లతో ఘనంగా నిర్వహించిన గొప్ప మనసు సీఎం సొంతం. ఎస్టీ ఎస్సీ సబ్‌ప్లాన్ చట్టం అమలు, కొమురం భీం మ్యూజియం, మేడారం సమ్మక్క సారలమ్మ మ్యూజియం ఏర్పాటు చేసిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానిదే. మార్కెట్ కమిటీలలో గిరిజనులకు 25 శాతం రిజర్వేషన్ కల్పించి గిరిజన బిడ్డలకు ప్రాతినిధ్యం దక్కేలా చేసిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్.
గిరిజన బిడ్డల కోసం కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా అనేక గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడమే కాకుండా విదేశీ చదువులు చదువుకోడానికి అంబేద్కర్ విద్యానిధిని ఏర్పాటు చేసిందీ సర్కార్. పోడు భూముల సమస్యపై జీఓ తీసుకు రావడంతో పాటు పోడు భూములను గిరిజనుల హక్కుగా గుర్తించింది.
బంజారా, ఆదివాసీ భవన్ల ప్రారంభం సందర్భంగా ‘మన కేసీఆర్-మన తెలంగాణ సర్కార్’ నినాదంతో ఈ కార్యక్రమంలో పాల్గొని సభను విజయవంతం చేద్దాం. సభను గిరిజన జాతరను తలపించేలా, మేడారం జాతరను గుర్తు చేసేలా ఘనంగా జరుపుకొందాం.
– జి లక్ష్మీ శంకర్ నాయక్
91007 45283
(వ్యాసకర్త: రీసెర్చ్ స్కాలర్, జర్నలిజం డిపార్ట్మెంట్)